Sunday, December 22, 2024

ముగిసిన సిఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన..

- Advertisement -
- Advertisement -

ఈ నెల 15వతేదీ నుండి 18వ తేది వరకు స్విట్జర్లాండ్‌లోని దావోస్ లో జరిగిన ప్రపంచ ఆర్దిక సదస్సులో ఐటి.శాఖ మంత్రి శ్రీధర్ బాబు తో కలిసి  సిఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.ఈ పర్యటనలో సిఎంఓ ముఖ్య కార్యదర్శి శేషాద్రి, ఐ.టి ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. దావోస్ పర్యటనలో భాగంగా వివిధ కంపేనీల సిఈఓలతో చర్చించి ఒప్పంచి దాదాపు 40వేల కొట్ల రూపాయల పెట్టుబడులు రాబట్టారు. ఇక ఈ నెల 18వతేదీన లండన్ కు సిఎం రేవంత్ రెడ్డి, ఐఏఎస్ అధికారులు దానకిషోర్,ఆమ్రపాలి తదితరులు వెళ్లారు. లండన్, దుబాయిలలో పలువురు పారిశ్రామిక వేత్తలతో భేటి అయిన సిఎం తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టాలని కోరారు.ఇవాళ హైదరాబాదుకు చేరుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News