- Advertisement -
జపాన్ పర్యటన ముగించుకొని బుధవారం రాత్రి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన స్వాగతం పలకడానికి శంషాబాద్ విమానాశ్రయానికి భారీ సంఖ్యలో కాంగ్రెస్ ఎంపిలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్‌లు, సలహాదారులు, పార్టీ శ్రేణులు తరలివచ్చారు. సిఎంను పలువురు శాలువాతో సన్మానించారు. ఈనెల 16వ తేదీన జపాన్‌కు పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఏడురోజుల పర్యటన అనంతరం బుధవారం రాత్రి తిరిగి హైదరాబాద్‌కు వచ్చారు.
- Advertisement -