మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై సీఎం రేవంత్ రెడ్డి ఫైరయ్యారు. అధికార, ప్రతిపక్షాలు అంటే శత్రువులు అనే విధంగా కేసీఆర్ తయారు చేశారని మండిపడ్డారు. “మీ పెద్దరికాన్ని నిలబెట్టుకోండి.. మీరు సూచనలు చేయండి” అని సిఎం రేవంత్ అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించిన మొబైల్ యాప్‌ను గురువారం సిఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి.. దేశంలో గుడి లేని ఊరు ఉండొచ్చు కానీ.. ఇందిరమ్మ కాలనీ లేని ఊరు లేదని అన్నారు. పది వేల రూపాయాలతో ప్రారంభమైన ఇందిరమ్మ ఇళ్ల పథకం ఇవాళ రూ.5 లక్షలకు చేరుకుందన్నారు.
“తెలంగాణ రైజింగ్ అని మనం అనకూడదా?.. పదేళ్ల కేసీఆర్ పాలన చూసి ప్రజలు ఏం తీర్పు ఇవ్వాలో అదే ఇచ్చారు. ప్రభుత్వం అంటే 64 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాదు.. 119 మంది ఎమ్మెల్యేలు కలిస్తేనే ప్రభుత్వం. ప్రతిపక్ష నేత కుర్చీ ఖాళీగా ఉండటం రాష్ట్రానికి మంచిదా?. కేసీఆర్ మీరు అసెంబ్లీ సమావేశాలకు రండి. సూచనలు, సలహాలు ఇవ్వండి” అని సిఎం రేవంత్‌రెడ్డి అన్నారు.