Wednesday, January 22, 2025

వృద్ధురాలికి సిఎం రేవంత్ రెడ్డి భరోసా

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: ఇల్లు లేక మరుగుదొడ్లో నివాసం ఉంటున్న ఓ వృద్ధురాలికి సిఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. ఆమెకు తక్షణమే ఇల్లు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. మీడియాలో వచ్చిన కథనానికి స్పందించిన ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం చిగురాల్‌పల్లిలో ఏరుళ్ల మల్లమ్మ అనే వృద్ధురాలు పేదరికంతో మరుగుదొడ్డిలో నివాసం ఉంటుంది. 20 ఏళ్ల క్రితం తన భర్త చనిపోవడంతో నానా కష్టాలు పడి ఇద్దరు కూతుళ్ల పెళ్లిళ్లు చేసింది. అనంతరం 15 ఏళ్ల క్రితం శిథిలావస్థలో ఉన్న తన ఇల్లు భారీ వర్షాలకు కూలిపోవడంతో అదే స్థలంలో ఓ చిన్న గుడిసె వేసుకుంది. ఎనిమిదేళ్ల క్రితం అది కూడా పడిపోవడంతో స్వచ్ఛ భారత్ మిషన్ కింద ప్రభుత్వం కట్టించిన బాత్రూంలో జీవనం సాగిస్తుంది.

ప్రభుత్వానికి ఎన్నిసార్లు దరఖాస్తు పెట్టుకున్నా ఇళ్లు కట్టిస్తామని చెప్పిందే తప్ప చేసింది లేదని ఆ వృద్ధురాలు వాపోయింది. మల్లమ్మ విషాదగాధపై ఓ మీడియా కథనం ప్రచురించింది. దీనిపై సిఎం రేవంత్‌రెడ్డి ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఇలాంటి పరిస్థితులు చూస్తే బాధ కలుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై వెంటనే స్పందించిన సిఎం ఆమెను పరామర్శించడంతో పాటు ఆమె క్షేమం కోసం తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులను సిఎం ఆదేశించారు. అంతేగాక ఆ వృద్ధురాలి ఇంటి మంజూరుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News