Wednesday, January 22, 2025

వారణాసి వర్సెస్ వయనాడ్ మధ్య పోరు

- Advertisement -
- Advertisement -

ఇందిరా, రాజీవ్‌లు దేశం కోసం ప్రాణత్యాగం చేశారన్నారు. సోనియా, రాహుల్ గాంధీ ప్రధాని పదవిని త్యాగం చేశారని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. వాయనాడ్ ప్రజలు రాహుల్ గాంధీ వైపు ఉన్నారని, తాను ప్రత్యేకంగా ప్రచారం చేయాల్సిన అవసరం లేదన్నారు. రాహుల్ గాంధీ పై వాయనాడ్ ప్రజల అభిమానాన్ని చూద్దామనే నేను తెలంగాణ నుంచి వచ్చానని ఆయన తెలిపారు. తెలంగాణ నుంచి పోటీ చేయాలని మేం రాహుల్ గాంధీని కోరామన్నారు.

కానీ, వాయనాడ్ వైపే ఆయన మొగ్గు చూపారన్నారు. గత ఎన్నికల్లో వాయనాడ్‌లో 65 శాతం ఓట్లు వచ్చాయని, ఈ సారి 75 శాతం ఓట్లు రావాలన్నారు. మోడీకి వ్యతిరేకంగా మనం పోరాటం చేస్తున్నామన్నారు. వారణాసి వర్సెస్ వయనాడ్ మధ్య ఇప్పుడు పోరాటం జరుగుతోందన్నారు. వయనాడ్ ప్రజలు ఓటు వేయబోయేది కేవలం ఎంపి అభ్యర్థికి మాత్రమే కాదని, దేశానికి కాబోయే ప్రధానికి అని ఆయన అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News