Saturday, March 1, 2025

రాజ్యాంగాన్ని రక్షిస్తాం

- Advertisement -
- Advertisement -

గజినీ మహమ్మద్ తరహాలో రాజ్యాంగంపై మోడీ దాడి మార్చడానికి
విఫల యత్నాలు మోడీ ప్రయత్నాలను పసిగట్టిన రాహుల్
రాజ్యాంగ పరిరక్షణకే ఆయన పోరాటం బిజెపి కాదు..అది బ్రిటిష్
జనతా పార్టీ ఇండోర్‌లో జరిగిన జై సంవిధాన్ ర్యాలీలో సిఎం రేవంత్

మన తెలంగాణ/హైదరాబాద్ :రాజ్యాంగాన్ని మార్చాలని ప్రధాని నరేంద్ర మోడీ కుట్ర చేస్తున్నారని ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆయన రాజ్యాంగాన్ని మార్చాలనే ప్ర యత్నాల్లోనే ఉన్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. అయితే రాహుల్ గాంధీ ఈ విషయాన్ని ముందుగానే గుర్తించి రాజ్యాంగ పరిరక్షణకు పోరాడుతున్నారని సిఎం అన్నా రు. సోమవారం మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జాతీయ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘జై బాపు, జై భీమ్, జై సంవిధాన్’ ర్యాలీలో ము ఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గజనీ మహమ్మ ద్ హిందుస్తాన్ ను దోచుకోవడానికి ప్రయత్నించినట్లు, రాజ్యాంగాన్ని మార్చాలని మోడీ ప్ర యత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. కానీ, ఆయన ప్రయత్నం ఫలించడం లేదన్నారు. ఆ నాడు బ్రిటిషర్ల నుంచి మహాత్మాగాంధీ దేశాన్ని రక్షించినట్లు భారతీయ జనతాపార్టీ పేరుతో చలామణి అవుతున్న బ్రిటిష్ జనతా పార్టీని ఎదుర్కొనేందుకు రాహుల్ గాంధీ నిలబడ్డారన్నారు. ఈ యుద్ధంలో మనమంతా రాహుల్ గాంధీతో కలిసి నడవాలన్నారు.

రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు మనమంతా కలిసికట్టుగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఇది ఎ న్నికల ర్యాలీ కాదని ఇది ఇది ఒక యుద్ధం ఆ యన అన్నారు. ఈ యుద్ధం గాంధీ పరివార్‌కు గాడ్సే పరివార్ మధ్య జరుగుతుందన్నారు. గాడ్సే పరివార్ వైపు నుంచి మోడీ, గాంధీ పరివార్ వైపు నుంచి రాహుల్ గాంధీ పోరాడుతున్నారని అందుకే మనమంతా గాంధీ పరివార్‌గా రాహుల్ గాం ధీకి మద్దతుగా నిలబడాలన్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News