Wednesday, September 18, 2024

కూలుస్తారా? కూల్చమంటారా?

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : కబ్జాదారుల గుండెల్లో వణుకు పుట్టించాల్సిందేనని హైదరాబాద్‌లో పోలీస్ అకాడమీలో బుధవారం జరిగిన సబ్ ఇన్‌స్పెక్టర్ల మూడో బ్యా చ్ పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సిఎం రేవంత్ రెడ్డి ‘హైడ్రా’ పనితీరు, భవిష్యత్ కార్యచరణపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పాసింగ్ అవుట్ పరేడ్‌కు ట్రైనింగ్ పూర్తి చేసుకున్న మొత్తం 547 సబ్ ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు. వీరిలో145 మంది మహిళా ఎస్‌ఐలు, 402 మంది పురుషులు ఉన్నారు. 547 శిక్షణ ఉద్యోగుల్లో 401 మంది సివిల్ ఎస్‌ఐలు ఉన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న 547 మం దిలో 472 మంది గ్రాడ్యుయేట్స్, 75 మం ది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. వీరిలో 248 మంది బిటెక్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వ చ్చారు. పాసింగ్ అవుట్ పరేడ్ కమాండర్‌గా మహిళా ఎస్‌ఐ భాగ్యశ్రీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్ మాట్లాడుతూ హైడ్రాపై కొందరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆక్రమణదారులను అవసరమైతే జైలుకు పం పించేందుకు కూడా వెనుకాడబోమ న్నారు. ముందుగానే మేల్కొంటే మాత్రం మంచిదని సూచించారు.

కొందరు పెద్దలు ప్రాజెక్టుల వద్ద ఫాంహౌస్‌లు కట్టుకున్నారని, ఫాంహౌస్‌ల నుంచి వచ్చే డ్రైనేజీని గండిపేటలో కలుపుతున్నారని ఆరోపించారు. గండిపేట జలాలు నగర ప్రజల తాగునీటికి వాడుతున్నామని చెప్పారు. నాలాల ఆక్రమణలతో ఉప్పెనలా వరదలు వస్తున్నాయని, వరదలు వస్తే పేదల ఇళ్లు మునుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చెరువులను ఆక్రమణల నుంచి విడిపించేందుకే హైడ్రా ఏర్పాటు చేశామని, ఆక్రమణలను వదిలి గౌరవంగా తప్పుకోండని సూచించారు. ఆక్రమిం చుకున్న చెరువులను స్వచ్ఛందంగా వదులుకోవాలని ఆక్రమణదారులకు ఆఫర్ ఇచ్చారు. లేకపోతే చెరువులలోని అక్రమ నిర్మాణాలను నేల మట్టం చేసి తీరుతామని హెచ్చరించారు. కూల్చివేతలపై స్టే తెచ్చుకున్నా కోర్టుల్లో కొట్లాడు తామన్నారు. చెరువులు, కుంటలు, నాలాల ఆక్రమణల వల్లే వరదలు వస్తున్నాయని వెల్లడించారు. వరదలతో పేదల జీవితాలు అతలాకుతలం అవుతున్నాయని అందుకే ప్రక్షాళన చేపట్టినట్టు వెల్లడించారు.

మూసీ ప్రక్షాళన
హైదరాబాద్ కాలుష్యం నల్గొండకు చేరుతోందని, ఆ కాలుష్యాన్ని నియంత్రించాలని తెలిపారు. ఆక్రమణలు తొలగించి మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి చేస్తామని, మూసీ పరివాహక ప్రాంతంలో పేదల ఆక్రమణలు ఉన్నాయని చెప్పారు. పేదల పట్ల ప్రభుత్వం మానవతా ధోరణితో వ్యవహరిస్తుందన్నారు. నాలాల ఆక్రమణలను నిరభ్యంతరంగా కూల్చేస్తామన్న రేవంత్ ఆక్రమణలు తొలగించి మూసీని ప్రక్షాళన చేస్తామన్నారు. మూసీ నాలాల్లో ఉన్న శాశ్వత నివాసదారులకు డబుల్ బెడ్రూం ఇండ్లు అందిస్తామని హామీ ఇచ్చారు. నివాసితులైన 11వేల మందిలో ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం పునరావాసం కల్పిస్తుందని భరోసా కల్పించారు. ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్ పరిధిలో నిర్మాణాలను రెగ్యులరైజ్ చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అక్రమ నిర్మాణాలు ఎప్పటికైనా నేలమట్టం కాకతప్పదన్నారు. హైదరాబాద్ నీటి కాలుష్యమంతా నల్గొండను ముంచెత్తుతోందని, అందుకే మూసీ నది ప్రక్షాళనను చేపట్టామని వెల్లడించారు.

సిఎం సహాయనిధికి పోలీసు విభాగం తరపున రూ.11.6 కోట్ల చెక్కు అందజేత
అంతకముందు పోలీస్ విభాగం తరఫున 11 కోట్ల 6 లక్షల 83 వేల 571 రూపాయలను ముఖ్యమంత్రి సహాయనిధికి ఉన్నతాధికారులు ప్రకటించారు. ఈ సందర్భంగా డీజీపీ జితేందర్, శివధర్ రెడ్డి తదితరులు రేవంత్‌రెడ్డికి చెక్‌ను అందజేశారు.
పోలీసులకు వరాలు
ఇదే వేదికపై నుంచి పోలీసులకు వరాలు ప్రకటించారు. పోలీసుల పిల్లల కోసం రెండు రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రారంభించబోతున్నట్టు వెల్లడిం చారు. హైదరాబాద్‌లో ఒకటి వరంగల్‌లో రెండోది నిర్మిస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్‌లో 50 ఎకరాల్లో పోలీసుల పిల్లల కోసం రెసిడె న్షియల్ పోలీస్ స్కూల్ ఏర్పాటు చేస్తామన్నారు. 50 ఎకరాల్లో వరంగల్‌లో మరో పోలీస్ స్కూల్ ఏర్పాటు చేయబోతున్నట్టు వెల్లడించారు. రాబో యే రెండేళ్లలో హైదరాబాద్‌లో పోలీస్ స్కూల్ ప్రవేశాలు మొదలు పెట్టేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. పోలీసు సిబ్బంది పిల్లలు ఒకే చోట చదువుకోవాలని సూచించారు.

పోలీసు ఉద్యోగమనేది బాధ్యత మాత్రమే కాదు..భావోద్వేగం
పోలీసులు ఉద్యోగమనేది బాధ్యతమాత్రమే కాదని భావోధ్వేగమన్నారు. తెలంగాణను పునర్నిర్మించి, భవిష్యత్ తరాలకు బాటలు వేయాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. ఏ సమస్య వచ్చినా ముందుగా అందుబాటులో ఉండేది పోలీసులేనని అందుకే వారు ప్రజలతో ఫ్రెండ్లీగా ఉండాలని సూచించారు. అకాడమీలో సబ్ ఇన్ స్పెక్టర్లుగా ట్రైనింగ్ పూర్తిచేసుకున్న 547 మందితో పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు. 402 మంది పురుషులు, 145 మంది మహిళలు ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారు. మహిళా ఎస్‌ఐ భాగ్యశ్రీ పరేడ్ కమాండర్‌గా వ్యవహరించారు. ట్రైనింగ్ పూర్తి చేసుకున్న సబ్ ఇన్‌స్పెక్టర్లు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. బాధితులతో ఫ్రెండ్లీ పోలీస్‌గా మెలుగుతూ క్రిమినల్స్ పట్ల కఠినంగా వ్యవహరించాలని సూచించారు.

తెలంగాణను కాపాడుకునేందుకే ఖాకీ డ్రస్సులనే విశ్వాసం ప్రజలకు కల్పించాలన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ లేకుం డా చేయడమే ప్రధాన లక్ష్యమని చెప్పిన సిఎం డ్రగ్స్, గంజాయిపై ఉక్కుపాదం మోపుతామన్నారు. అలాగే సైబర్ క్రైమ్ రేటు కూడా తగ్గించేం దుకు కృషి చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్, సైబర్ నేరాలకు స్థానం లేదనే విధంగా పనిచేయాలని ట్రైనింగ్ పూర్తిచేసుకున్న ఎస్‌ఐ లకు సూచించారు. యువతకు తమ ప్రభుత్వ పనితీరుపై ఎలాంటి అనుమానాలు అక్కర్లేదన్నారు. అందరిని చూస్తోంటే తెలంగాణ డ్రగ్స్ రహి తంగా మారుతుందన్న నమ్మకం కలుగుతోందన్నారు. అకాడమీలో శిక్షణలో మెరుగైన ప్రదర్శన చేసిన వారికి సిఎం మెడల్స్ అందించారు.

కాంక్రీట్ పోలీసింగ్ అవసరం
కాస్మెటిక్ పోలీసింగ్ కాకుండా కాంక్రీట్ పోలీసింగ్ అవసరమన్నారు రేవంత్. ఫ్రెండ్లీ పోలీసింగ్ బాధితులకు మాత్రమే నేరస్తులకు కాదన్నారు. తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర చాలా ముఖ్యమన్నారు రేవంత్ రెడ్డి. యువత ప్రాణత్యాగంతో సాదించుకున్న తెలంగాణ తొమ్మిదేళ్లుగా అనేక సమస్యలు ఎదుర్కొందన్నారు. నిరుద్యోగుల ఆకాంక్షలు నెరవేరలేదని గుర్తు చేశారు. అన్నింటినీ చూసిన ప్రజలు కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చారని తెలిపారు. వారి దయతో ప్రజాప్రభుత్వ ఏర్పడిందని వివరించారు.

టిఎస్‌పిఎస్‌సిని పూర్తిగా ప్రక్షాళన చేశాం
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక టిఎస్‌పిఎస్‌సిని పూర్తిగా ప్రక్షాళన చేశామన్నారు. గడిచిన తొమ్మిదేళ్లలో కుటుంబ పాలనలో రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని, నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగం అందని ద్రాక్షగా మార్చారన్నారు. తెలంగాణ పునర్నిర్మాణమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. తాము అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే 30 వేలకుపైగా ఉద్యోగాలు భర్తీ చేసినట్టు పేర్కొన్నారు రేవంత్. ఒక్కో వ్యవస్థను ప్రక్షాళన చేస్తూ వచ్చామని ఇప్పుడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ప్రక్షాళించామన్నారు. టిఎస్‌పిఎస్‌సిపై నిరుద్యోగులకు ఎలాంటి అనుమానాలు లేవని వ్యాఖ్యానించారు. గతంలో ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురు చూసే పరిస్థితి ఉందని, ప్రస్తుత ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు వరుసగా ఇస్తోందని చెప్పారు. అన్ని నోటిఫికేషన్లు ఒకేసారి ఇస్తే ఇబ్బందవుతుందని వాయిదా వేయాలని కోరారు. గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేసి నిరుద్యోగులకు అనుకూల నిర్ణయం తీసుకున్నాం. తెలంగాణలో నిరుద్యోగ యువకులు ఉత్సాహంతో పరీక్షలకు సిద్ధం అవుతున్నారని ఆకాంక్షించారు.

30 వేలకు పైగా ఉద్యోగాలు కల్పించాం.. మరో 35 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చాం
గత ప్రభుత్వ హయాంలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని, తెలంగాణలో డిసెంబర్ 3న ప్రజాపాలన ఆవిర్భవించిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ వచ్చాక 30 వేలకుపైగా ఉద్యోగాలు కల్పించామని, మరో 35 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చామని వెల్లడించారు. కొత్తగా గ్రూప్-1, 2, 3, డీఎస్సీ, పారామెడికల్ సిబ్బంది భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చామని తెలిపారు.
కడుపు కట్టుకుని నిధులు సేకరించాం.. రైతన్న కళ్లల్లో ఆనందం నింపాం
తమ ప్రభుత్వం పెట్టుబడులు తీసుకురావడం, ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా రైతన్నలు, నేతన్నలు, గీతన్నలను ఆదుకుంటోందన్నారు. త్యాగా లతో సాధించుకున్న తెలంగాణలో వ్యసనాలకు తావు లేదన్నారు. రైతులు ఆత్మగౌరవంతో తల ఎత్తుకునేలా ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయ న్నారు. కేవలం 28 రోజుల్లోనే 22 లక్షల 22 వేల 685 రైతుల ఖాతాల్లో రూ.18వేల కోట్లు వేసి రుణమాఫీ చేశామని గుర్తు చేశారు. కడుపు కట్టుకుని నిధులు సేకరించి, రుణమాఫీ చేసి రైతుల కళ్లల్లో ఆనందం చూస్తున్నామని అభిప్రాయపడ్డారు.

కులవృత్తులతో పాటు చేతి వృత్తులను బలోపేతం
కులవృత్తులతో పాటు చేతి వృత్తులను బలోపేతం చేస్తున్నాం. వ్యవసాయం దండగ కాదు, పండుగ అని నిరూపించాం. ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్లలో ఇళ్లు కట్టుకున్నవారు వెంటనే వాటిని విడిచిపెట్టాలని సీఎం రేవంత్ పునరుద్ఘాటించారు.
క్రీడా భవనాన్ని ప్రారంభం..పోలీసు ఉన్నతాధికారులతో కలిసి బ్యాడ్మింటన్ ఆడిన సిఎం రేవంత్
పోలీస్ అకాడమీ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన క్రీడా భవనాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు. బ్యాట్మింటన్, ్యట్మింటన్ టెన్నిస్ వంటి క్రీడా వసతులతో పాటు అధునాతన జిమ్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీస్ ఉన్నతాధికారులతో కలిసి సీఎం గారు కాసేపు బ్యాడ్మింటన్ ఆడారు. ఈ కార్య్క్మ్రంలో పలువురు ప్రజాప్రతినిధులు, డీజీపీ జితేంద్ గారు సహా ఉన్న్తాధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News