Friday, February 21, 2025

నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరైన సిఎం రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు. ఎన్నికల ప్రచార సమయంలో నిబంధనలు ఉల్లంఘించారని ఆయనపై గతంలో నల్గొండ టూటౌన్ పోలీస్ స్టేషన్, బేగంబజార్ పిఎస్, మెదక్ జిల్లా కౌడిపల్లి పిఎస్ పరిధిలో కేసులు నమోదయ్యాయి. అలాగే బిజెపి రిజర్వేషన్లు తొలగిస్తుందంటూ గత ఎన్నికల్లో వీడియో రిలీజ్ వ్యవహారంలో రేవంత్ రెడ్డిపై కేసు నమోదయ్యింది. ఆ సమయంలో రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్‌గా ఉన్నారు.

ఇలా తనపై నమోదైన మొత్తం 9 కేసులకు సంబంధించిన విచారణలో భాగంగా రేవంత్ రెడ్డి గురువారం నాంపల్లి ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. సిఎం వస్తుండటంతో కోర్టు దగ్గర భారీగా పోలీసులను మొహరించారు. ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 23వ తేదీకి వాయిదా వేశారు. టిపిసిసి లీగల్ సెల్ వైస్ చైర్మన్ తిరుపతి వర్మ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కేసులు నమోదు చేసిందని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News