Friday, January 10, 2025

సిఎం రేవంత్‌ రెడ్డి ఆస్ట్రేలియా పర్యటన రద్దు

- Advertisement -
- Advertisement -

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆస్ట్రేలియా పర్యటన రద్దయ్యింది. ఈనెల 14వ తేదీన సిఎం రేవంత్ ఢిల్లీకి వెళ్లనున్నారు. 15,16వ తేదీల్లో సిఎం ఢిల్లీ పర్యటన కొనసాగనుంది. 15న ఢిల్లీలో జరిగే ఏఐసిసి కార్యాలయ ప్రారంభోత్సవానికి హాజరుకానున్నారు. 16వ తేదీన పలువురు కేంద్రమంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి అభ్యర్ధించనున్నారు. అనంతరం ఈనెల 17వ తేదీన ఢిల్లీ నుంచి సిఎం రేవంత్‌రెడ్డి సింగపూర్‌కు వెళ్లనున్నారు. 17, 18వ తేదీల్లో సింగపూర్‌లో సిఎం రేవంత్ పర్యటిస్తారు. 19వ తేదీన సింగపూర్ నుంచి దావోస్‌కు ముఖ్యమంత్రి వెళ్లనున్నారు. 23వ తేదీ వరకు దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొంటారు.

17వ తేదీ నుంచి 23వ తేదీ వరకు విదేశీ పర్యటనకు
విదేశీ పర్యటనకు వెళ్లేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఏసిబి కోర్టు అనుమతి ఇచ్చింది. జూలై 6వ తేదీ లోపు తిరిగి పాస్ పోర్టును అప్పగించాలని ఆదేశించింది. ఈనెల 17వ తేదీ నుంచి 23వ తేదీ వరకు సిఎం రేవంత్‌రెడ్డి విదేశాల్లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు ఏసిబి కోర్టు ప్రత్యేక అనుమతి ఇచ్చింది. ఓటుకు నోటు కేసులో బెయిల్ కోసం రేవంత్‌రెడ్డి తన పాస్‌పోర్టును కోర్టుకు అప్పగించారు. విదేశాలకు వెళ్లే ప్రతిసారి కోర్టు నుంచి తన పాస్‌పోర్టును తీసుకుంటున్నారు.

ఈ క్రమంలో రాబోయే విదేశీ పర్యటనల నేపథ్యంలో పాస్‌పోర్టును కోసం కోర్టుకు విజ్ఞప్తి చేశారు. సింగపూర్, స్విట్జర్లాండ్ పర్యటనకు వెళ్లాల్సి ఉందని, ఆరు నెలల పాటు పాస్‌పోర్టును ఇవ్వాలని సిఎం అభ్యర్థించారు. ముఖ్యమంత్రి అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న ఏసిబి కోర్టు గురువారం పాస్‌పోర్టు ఇచ్చేందుకు అంగీకరించింది. గతంలోనే ఏసిబి ఇలాగే విదేశీ పర్యటనకు ముఖ్యమంత్రి రేవంత్‌కు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News