Thursday, February 20, 2025

కెసిఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సిఎం రేవంత్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

బిఆర్‌ఎస్ అధినేత, మాజీ సిఎం కె.చంద్రశేఖర్‌రావుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా పుట్టినరోజుశుభాకాంక్షలు తెలిపారు. గజ్వేల్ నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు పుట్టినరోజు శుభాకాంక్షలు అని పేర్కొన్నారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షిస్తున్నా అంటూ ట్వీట్ చేశారు. అలాగే మంత్రి పొన్నం ప్రభాకర్ ఎక్స్ వేదికగా కెసిఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

కెసిఆర్‌తో కలిసి ఉన్న ఫొటోను ఆయన ఎక్స్‌లో ఫోస్టు చేశారు. గజ్వేల్ శాసనసభ్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు జన్మదిన శుభాకాంక్షలు… మీరు ఆరోగ్యంగా, సుఖశాంతులతో దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నాను అంటూ ట్వీట్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి, శాసనసభ ప్రతిపక్ష నేత కెసిఆర్‌కు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ఫోన్ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

చంద్రబాబు, జగన్ శుభాకాంక్షలు
బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్‌కు ఎపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కెసిఆర్ దీర్ఘాయుష్షుతో ఉండాలని ఆకాంక్షించారు. అలాగే ఎపి మంత్రి నారా లోకేష్ కెసిఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా ఎపి మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌సిపి అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాజీ సిఎం కెసిఆర్‌కు ఎక్స్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దేవుడు ఆయనకు ఆరోగ్యం,సంతోషకరమైన పరిపూర్ణ జీవితాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నా అంటూ వైఎస్ జగన్ ఆకాంక్షించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News