మీ పనితీరుకు సంబంధించిన సమస్త సమాచారం
నా దగ్గర ఉన్నది ఎవరెవరు జనంలో ఉన్నారో నాకు
తెలుసు నేను మారాను..మీరూ మారండి నేను కూడా
ప్రజలతో మమేకమవుతా కొత్త ఏడాది..కొత్త
ఆలోచనలతో ముందుకు వెళ్దాం పథకాలు పేదలకు
అందేలా చూడాలి ప్రజాప్రతినిధులుగా మొదటిసారి
గెలవడం గొప్పకాదు స్థానిక సమరమే లక్షంగా
క్యాడర్‌ను కలుపుకొని ముందుకు సాగాలి మంత్రులు,
ఎంపిలు, ఎంఎల్‌ఎలకు సిఎం రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం
మన తెలంగాణ/హైదరాబాద్:నేను మారాను… మీరు కూడా మారాలని సిఎం రేవంత్‌రెడ్డి అన్నా రు. మీ పనితీరుకు సంబంధించిన ప్రోగ్రెస్ రిపోర్టు ఉందని, పనితీరును అందరూ మెరుగుపరుచుకోవాలని సిఎం రేవంత్‌రెడ్డి మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలతో పేర్కొన్నా రు. ఎవరెవరూ ప్రజల్లో ఉన్నారన్న విషయాల గురించి తనకు ఎప్పటికప్పుడు నివేదిక అందుతుందని, తాను కూడా ప్రజలతో మమేకం అవుతానని ఆయన అన్నారు. కొత్త ఏడాది కొత్త ఆలోచనలతో ముందుకెళ్లాలని సిఎం వారికి పిలుపునిచ్చారు. ప్రజాపాలనలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన పథకాలు ప్రజలకు అందేలా చూడాలని, పేదలకు ఈ పథకాలు అందేలా అం దరూ కృషి చేయాలని సిఎం రేవంత్‌రెడ్డి మంత్రు లు, ఎంపిలు, ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం చేశారు. నూతన సంవత్సర వేడుకలకు భిన్నంగా కార్యాచరణ దిశగా బాధ్యతాయుతంగా ముందుకెళ్లాలని సిఎం వారికి సూచించారు.
బుధవారం రేవంత్‌రెడ్డిని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపిలు క లిసి నూ తన సంవత్సర శుభాకాంక్షలు తెలిపా రు. ప్రజాపాలన ఏర్పాటై సంవత్సరం పూర్తయిన సందర్భం గా సిఎం తనను కలిసిన మంత్రులు, ఎంపి లు, ఎమ్మెల్యేలతో సమీక్ష చేశారు. ఈ సందర్భం గా సిఎం మాట్లాడుతూ ప్రజా ప్రతినిధుల మొదటిసా రి గెలవడం గొప్ప కాదని, రెండోసారి గెలుపు అనే ది చాలా ముఖ్యమని, దానిని నిలబెట్టుకునేలా మ న పనితీరు ప్రజలకు కనబడాలని సిఎం వారితో పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా కేడర్‌ను కలుపుకొని ముందుకెళ్లాలని, ప్రజా ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను ప్రజల్లోకి క్షేత్రస్థాయిలో తీసుకెళ్లి వారికి వివరించాలని సిఎం దిశా నిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలోనే మొదటి సంవత్సరం ప్రజా పాలనలో చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల గురించి సిఎం వారితో సమీక్ష చేశారు. తనను కలిసిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపిలు ముఖ్యంగా నూతనంగా గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపిలను ఉద్దేశించి సిఎం మాట్లాడారు.
ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపిన సిఎం
బుధవారం స్వయంగా సిఎం రేవంత్ కొందరు మంత్రులకు, ఎంపిలు, ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి నూతన సంవత్సరం సందర్భంగా వారితో మాట్లాడి వారికి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు కూడా వారి వారి స్థాయిలో కింది నాయకులకు, కార్యకర్తలకు ఫోన్లు చేసి మాట్లాడాలని సిఎం వారి సూచించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల లక్ష్యంగా కలిసికట్టుగా ఎటువంటి గ్రూపు తగాదాలు లేకుండా పనిచేయాలని సిఎం వారికి సూచించారు. చిన్నచిన్న గ్రూపు తగాదాలు ఉన్నా సర్దుకుపోయి ముందుకెళ్లాలని సిఎం రేవంత్ వారితో పేర్కొన్నారు. సమాజం పట్ల మరింత బాధ్యత పెంచుకోవాల్సిన అవసరం ఉందని సిఎం వారికి సూచించారు. ఈ కొత్త సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితంలో సుఖ, సంతోషాలను నింపాలని సిఎం ఆకాంక్షించారు. జూబ్లీహిల్స్‌లోని సిఎం రేవంత్‌రెడ్డి నివాసంలో ఆయన్ను మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపి భువనగిరి చామల కిరణ్‌కుమార్ రెడ్డి, మహిళా నేతలు తదితరులు బుధవారం కలిశారు.