ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఏల్పీ సమావేశం ప్రారంభమైంది. శంషాబాద్ నోవాటెల్ లో జరుగుతున్న ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, సంజయ్, తెల్లం వెంకట్రావు లు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ భేటి ఎస్సి వర్గీకరణపై చర్చిస్తున్నట్లు సమాచారం. అలాగే, సన్న బియ్యం, ఇంధిరమ్మ ఇండ్లు, భూ భారతిపై ప్రజలకు అవగాహన కల్పించడంపై ముఖ్యమంత్రి రేవంత్.. దిశానిర్దేశం చేస్తున్నట్లు తెలుస్తోంది. వీటితోపాటు పార్టీలో పలు కీలక అంశాలపై చర్చిస్తున్నారు.
కాగా, ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, ప్రేమ్ సాగర్ రావు, రాజగోపాల్ రెడ్డిలు డుమ్మా కొట్టారు. అయితే, ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా మంత్రి పదవి ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. కానీ, మంత్రి వర్గ విస్తరణపై అధిష్టానం సీక్రెట్ గా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.