Monday, December 23, 2024

హరీశ్ రావుకు సిఎం రేవంత్ రెడ్డి సవాల్..

- Advertisement -
- Advertisement -

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావుకు సవాల్ విసిరారు. ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేశామని సిఎం అన్నారు. ఖమ్మం జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభలో రేవంత్ మాట్లాడుతూ.. “కాంగ్రెస్‌ ప్రభుత్వం రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తే సిద్దిపేట ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని హరీశ్‌రావు సవాల్‌ చేశారు. రుణమాఫీ అమలు చేశాం.. హరీశ్‌రావు రాజీనామా చేయాలి.. లేదంటే తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పాలి. అమర వీరుల స్తూపం వద్ద ముక్కు నేలకు రాయాలి. తాను విసిరిన సవాల్‌ను వెనక్కి తీసుకుంటున్నట్టు హరీశ్‌రావు చెప్పాలి’’ అని డిమాండ్‌ చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని రేవంత్ ఫైరయ్యారు. 8 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై, తాము అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై, 10ఏళ్ల బీఆర్ఎస్ పాలనపై చర్చకు తాము సిద్ధమని సిఎం రేవంత్ అన్నారు. “ఎక్కడ చర్చ పెడుదామో చెప్పు.. కాంగ్రెస్ ప్రభుత్వం తరుపున మా మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు వస్తారు.. దమ్మంటే, చర్చకు నువ్వొస్తవో లేక, మీ మామ, బామ్మర్ది వస్తడో రండి” అంటూ హరీశ్ రావుకు సిఎం రేవంత్ సవాల్ విసిరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News