Sunday, January 5, 2025

రుణమాఫీపై చర్చకు సై

- Advertisement -
- Advertisement -

బిజెపి, బిఆర్‌ఎస్ కలిసి వచ్చినా..విడివిడిగా వచ్చినా చర్చకు సిద్ధమే 10నెలల్లో
రూ.2లక్షల రుణమాఫీ చేసిన ఘనత మాదే గతంలో ఏ ప్రభుత్వమూ ఈవిధంగా
చేయలేదు గత ప్రభుత్వం రూ.11వేల కోట్ల రుణమాఫీ చేస్తే అందులో రూ.8వేల
కోట్లు మిత్తీలకే పోయింది 25లక్షల రైతు కుటుంబాలకు రూ.21వేల కోట్ల
రుణమాఫీ చేశాం వివిధ కారణాల వల్ల రుణమాఫీ కాని 3.14లక్షల మంది
రైతులకు రూ.2747కోట్లు విడుదల మాయగాళ్ల మాటలు నమ్మి అభివృద్ధిని
అడ్డుకోకండి ఎకరాకు రూ.20 లక్షల పరిహారమైనా ఇప్పిస్తా అభివృద్ధి
జరగాలంటే భూసేకరణ జరపాల్సిందే.. 70ఏళ్ల తరువాత పాలమూరు
బిడ్డకు సిఎంగా అవకాశం జిల్లా అభివృద్ధికి రూ.100కోట్ల నిధులు ఇస్తా
రైతు పండుగ ముగింపు సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

ప్రధాని మోడీ, మాజీ సిఎం కెసిఆర్‌కు ముఖ్యమంత్రి రేవంత్ బహిరంగ సవాల్

మనతెలంగాణ/మహబూబ్‌నగర్‌బ్యూరో: ‘తెలంగాణ రైతంగానికి నేను సగర్వంగా చెప్పదల్చుకు న్నా..29 రాష్ట్రాల సిఎంలకు, ప్రధాన మంత్రి న రేంద్ర మోడీకి, కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు సవాల్ విసరుతున్నా.. ఈ దేశంలో స్వా తంత్య్రం వచ్చినప్పటి నుంచి ఏ రాష్ట్రమై నా 10 నెలల 25 రోజుల్లో 22,22,062 రైతు కుటుంబాలకు 17, 865 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన చరిత్ర ఉందా’ ?..దీనిపై చర్చకు సిద్ధంగా ఉన్నారా? అని సిఎం రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. మోడీ వస్తారా ? కల్వకుంట్ల చంద్రశేఖర్ వస్తారా? మీరిద్దరు కలిసి రండి అని అన్నారు. వివిధ కారణాల వల్ల రుణమాఫీ కాని 3.14లక్షల మందికి రుణ మాఫీ కోసం రూ.2747 కో ట్లు తాజాగా విడుద ల చేశామని వెల్లడించారు. అధికారంలోకి వచ్చి న తొలి సంవత్సరంలోనే 20 లక్షల రైతు కుటుంబాలకు రూ. 21 వేల కోట్ల మేర రైతు రుణమాఫీ చేసిన ప్రభుత్వం తమదేనని ముఖ్యమంత్రి రేవం త్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రజాపాలన ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం సాయంత్రం మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగిన రైతు పండుగ బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు.

గడీలను కూల్చినరోజు :
‘నవంబర్ 30వ తేదీ .. ఈ రోజు రాజకీయాల్లో గొప్ప మార్పు వచ్చిన రోజు.. నేను గుర్తు చేయదలచుకున్నాను..నవంబర్ 30, 2023న రాష్ట్రంలో 35 వేల పోలింగ్ బూత్‌లలో చీమల దండై గడీలను కుప్పకూల్చి 92 లక్షల ఓట్లతో కాంగ్రెస్‌ను గెలిపించి సొనియాగాంధీకి మద్దతు ఇచ్చారని రేవంత్ అన్నారు. నవంబర్ 23 ఏ అభిమానంతో, గుండె ధైర్యంతో మీ బిడ్డకు ఏకీకృతమై మీరు అండాగా నిలబడ్డ రోజులు అవి. ఎప్పటికీ తాను మరవలేనని అన్నారు. పాలమూరులో నల్లమలబిడ్డగా, అటవీ ప్రాంతానికి చేరువలో ఉన్న కొండారెడిపల్లి రైతు బిడ్డడగా బయలు దేరిన తాను ఎన్నో కష్టాలు పడ్డానని. .కన్నీళ్లు చూసినా, కష్ణగలలు చూసినా, వలసలు చూసినా, గంపు మేస్త్రీల ఆగడాలు చూసినా, ముసలోల్లను, కన్నబిడ్డలను ఇంటిదగ్గర వదిలేసి ముంబాయి వలసలు వెళ్లే జంటలు కన్నీలు చూశానని అన్నారు. అచ్చంపేట, నాగర్ కర్నూలు, వనపర్తి ప్రాంతాల్లో గుంపు తట్టపని ముంబాయి వలసలు పోతుంటే బాధ కలిగేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ రోజు తాను అనుకునేవాడినని, మనకు అధికారం వస్తే ఈ వలసలు ఆపాలని.. కానీ అంత సులభంగా వస్తుందా అని. కానీ ఈ రోజు ఆ అవకాశం వచ్చిందని రేవంత్ అన్నారు.

70 సంవత్సరాల తర్వాత పాలమూరు బిడ్డకు సిఎంగా అవకాశం ః
70 ఏళ్ల క్రితం ఉమ్మడి హైదరాబాద్ రాష్ట్రంలో బూర్డుల రామకృష్ణారావు ్ణ సిఎం 70 సంవ్సరాల తర్వాత తిరిగి పాలమూరు బిడ్డకు సిఎంగా అవకాశం వచ్చిందన్నారు..దీంతో తన జన్మధన్యమైందని అన్నారు. ఈ అవకాశం కూడా ఆషామాషీగా రాలేదని,..సిఎంగా ఆర్భాటంతో కాదు..బాధ్యత.. జవాబుదారీతననంతో ఉంటానని తెలిపారు. కాంగ్రెస్‌లో ఎంతో మంది పెద్దలు ఉత్తమ్, తలసాని, పొంగులేటి, భట్టి విక్రమార్క లాంటి పెద్దలు ఉన్నా పెద్ద మనస్సుతో వయస్సులో చిన్నవాడినైనా తనకు సిఎం పదవి ఇచ్చారని అన్నారు. తాను జడ్‌పిటిసిగా, ఎంఎల్‌సిగా, ఎంఎల్‌ఎగా, ఎంపిగా పనిచేసిన అనుభవం తప్ప కనీసం కేంద్రమంత్రిగా పనిచేసిన అనుభవం లేకపోయినా సిఎం కుర్చీలో కూర్చోబెట్టారని అన్నారు. పాలమూరు బిడ్డగా పెద్దలందరి అశీర్వాదంతో ప్రజలకు అండగా ఉంటానని అన్నారు.

బిజెపి, బిఆర్‌ఎస్ నాయకులు అంటున్నారు… ముఖ్యంగా బిఆర్‌ఎస్ నాయకులు ఏరకంగా అంటున్నారో, ఏ రకంగా విమర్శిస్తున్నారో నిశితంగా గమనించాలని రైతులను కోరారు. ‘పది సంవత్సరాల పాటు వారు పరిపాలన చేశారు.. రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు…మట్టిని నమ్ముకున్న మీరు..మట్టిలోనే పుట్టిన మీరు… మట్టినే శాశ్వతంగా నమ్మే మీకు రైతు రుణమాఫీ గత ప్రభుత్వంలో జరిగిందా ? అని రైతులను ఉద్దేశించి అడిగారు. ఆనాడు కెసిఆర్ చెప్పిన మాటలను రైతులు ఇంకా మరవలేదని అన్నారు.
ఆరోజు వరి వేస్తే ఉరి అని చెప్పింది కెసిఆర్ కాదా? అని అన్నారు. ఆనాడు కెసిఆర్ వరి వేస్తే ఉరి అంటే ఈనాడు వరి వేస్తే రూ.500 బోనస్ ఇస్తామని అన్నది ఉత్తమ్ కుమార్‌రెడ్డి కాదా? అని రైతులను ప్రశ్నించారు. వరి వేసుకుంటే మూడు రోజుల్లోనే కనకవర్షం లాగా రైతుల అకౌంట్లలో బోనస్ డబ్బులు గలగల పడుతుంటే బిఆర్‌ఎస్ నాయకుల గెండెల్లో పిడుగులు పడుతున్నాయని ఎద్దేవా చేశారు.

కాళేశ్వరం పేరుతో కమీషన్లు తిన్నారు ః
‘ఇవ్వాల కాళేశ్వరం కట్టినా అన్నాడు…పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు కట్టినా అన్నాడు.. పది సంవత్సరాలలో కెసిఆర్ కేవలం సాగునీటి ప్రాజెక్టుల కోసం కాంట్రాక్టుల కోసం రూ.1.83 కోట్లు ఖర్చుపెట్టిండు..అందులో కాళేశ్వరానికే రూ. 1.02 వేల కోట్లు ఖర్చుపెట్టారు’ అని ఆరోపించారు. ‘లక్ష కోట్లు ఖర్చుపెట్టి కాళేశ్వరం నీళ్లతో ధాన్యం పండించినట్లు గొప్పులు చెప్పుకున్నాడు..అయినా మేము అనలేదు.. వారు కట్టిన మేడిగడ్డ కావచ్చు, అన్నారం కావచ్చు…కాళేశ్వరం కావచ్చు..ఇవన్నీ కుప్పకూలిపోయి చుక్కనీరు రాకపోయినా.. ఈనాడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా.. కాంగ్రెస్ హయాంలో కట్టిన జూరాల కావచ్చు, శ్రీశైలం కావచ్చు.. నాగార్జునసాగర్ కావచ్చు.. నెట్టెంపాడు కావచ్చు.. శ్రీరాంసాగర్ కావచ్చు.. కోయిల్‌సాగర్ కావచ్చు..మంజీరా కావచ్చు..ఎల్లంపల్లి కావచ్చు…ఈ ఏడాది కాళేశ్వరం లేకపోయినా 1.53 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం చరిత్రలోనే పండించినట్లు తెలిపారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఈనాటి వరకు 75 సంవత్సరాల్లో ఉమ్మడి రాష్ట్ర 23 జిల్లాలో ఒక పంటకు 1 కోటి 53 లక్షల టన్నుల వడ్లు ఎన్నడూ పండలేదన్నారు.

తెలంగాణలో ప్రజాపాలన ప్రభుత్వంలో ఒక పంటలకు 66 లక్షల ఎకరాలల్లో కోటి 53 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండించి రూ.500 బోనస్ ఇచ్చి ధైర్యంగా పాలమూరు గడ్డమీద పండుగు చేసుకుంటున్నామని అన్నారు. అయితే ‘ఇవాల ఈ పండుగ చేసుకునే హక్కులేదని బిఆర్‌ఎస్ వాళ్ల్లు అంటున్నారు..పది సంవత్సరాల కెసిఆర్ పాలనలో మొదటి ఐదు సంవత్సారాల్లో లక్ష వరకు రుణ మాఫీ చేస్తానన్నారు.. నాలుగు విడుతలన్నాడు..మిత్తి కూడా కడతా అన్నాడు..ఆయన కట్టిన దాంట్లో ..అసలు కంటే మిత్తే రైతులు ఎక్కవ చెల్లించారు’ అని సిఎం అన్నారు. 2018 నుంచి 2023 వరకు మళ్లీ లక్ష రుణమాఫీ అని చెప్పిన కెసిఆర్ మొదట నాలుగు సంవత్సరాలు అణా పైసా కూడా ఇవ్వలేదని ఆరోపించారు. ఆఖరి సంవత్సరం అవుటర్ రింగ్ రోడ్డును రూ.7500 వేల కోట్లకు అమ్మి రైతుల ఖాతాలో వేస్తే రూ.8565 కోట్లు రైతుల మిత్తికి పోతే, ఆయన ఇచ్చింది రూ.2500 కోట్లేనని చెప్పారు. ఆనాడు అద్భుతమైన అవుటర్ రింగ్ రోడ్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తే, అవుటర్ రింగ్ రోడ్డును తెగనమ్మి రైతులకు మీరిచ్చిన రైతు రుణ మాఫీ కేవలం రూ. 2500 కోట్లేనని అన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం రుణమాఫీ చేసిందంటే సోనియాగాంధీఆశీర్వాదంతోనని అన్నారు.

ఒక్కొక్కరు వస్తారా ? అందరూ కలిసి వస్తారా చర్చకు సవాల్ ః
బిజెపి, బిఆర్‌ఎస్ నాయకులు ఇవ్వాల ఒకొక్కరు వస్తారో ,అందరు కలిసి వస్తారో ఎలా వస్తారో రండి..అసెంబ్లీలో తేలుద్దామా. పాలమూరు గడ్డమీద తేలుద్దామా ? మొదట సంవత్సరంలో 25 లక్షల కుటుంబాలకు 21 వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన పేటెంట్ కాంగ్రెస్ గ్యారెంటేనని అన్నారు. గ్యారెంటీల గురించి చెప్పదల్చుకుంటే స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి దళితులకు, ఆదివాసులకు, బిసిలకు అసైన్‌మెంట్ చేసి భూ పట్టాలు ఇవ్వడం ద్వారా, ఆ రైతులను ఆదుకున్న గ్యారెంట్ పేటెంట్ కాంగ్రెస్‌దేనన్నారు. రైతు రుణమాఫీ, కనీస మద్దతు ధర ఇచ్చిన చరిత్ర తమదేనని అన్నారు. ఈ రోజు రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చిన ఘనత కూడా ఆనాడు వైఎస్‌ఆర్ సిఎంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిందేనని చెప్పారు. దేశంలోనే ఉచిత విద్యుత్ ఇచ్చిన పేటెంట్ కూడా కాంగ్రెస్‌దేనన్నారు. అన్నిరకాల రైతులకు అండగా ఉంది కాంగ్రెస్సేనని అన్నారు. వీటిపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, ఎవరొస్తారో రావాలని సిఎం సవాల్ విసిరారు.

‘75 ఏ తర్వాత ఈ జిల్లాకు అవకాశం వచ్చింది.. ఉమ్మడి రాష్ట్రంలో మనకు అన్యాయం చేశారని కెసిఆర్ అంటున్నాడు.. మరి మీరేమి చేశారు’ అని కెసిఆర్‌ను సిఎంను నిలదీశారు. ‘కరీంనగర్‌లో ఓడిపోతానని పాలమూరు జిల్లాకు వస్తే నీకు ఊరు లేకపోయినా ,పార్లమెంట్‌లో నీ నోరు లేకపోయినా 2009లో కెసిఆర్‌ను ఎంపిగా గెలిపించి పల్లకిలో మోసింది మా పాలమూరు ప్రజలు కాదా’ అని నిలదీశారు. తెలంగాణ వచ్చిన తర్వాత జిల్లాలోని ప్రాజెక్టులను పూర్తి చేయాల్సిన బాధ్యత మీ ప్రభుత్వానికి లేకుండా పోయింది ఎందుకని ప్రశ్నించారు. ‘ఆరోజు ఎంఎల్‌ఎలు, అందరు నిన్ను ఎంపిగా గెలిపించి అండగా నిలబడితే మీరు మా గుండెల మీద తన్ని పాలమూరుకు కెసిఆర్ అన్యాయం చేసి ఎడారిగా చేశారు’ అని విమర్శించారు. కెసిఆర్ చేయని ప్రాజెక్టులు కల్వకుర్తి, నెట్టెం పాడు, కోయల్ సాగర్, నారాయణపేట, కొడంగల్ ప్రాజెక్టులను తాము పూర్తి చేయాలనుకుంటే మక్త్తల్‌కు నీళ్లు వద్దే వద్దు అంటున్నాడని ఆరోపించారు.

ః పాలమూరును ఎవడి దత్తత అవసరం లేదు ః
‘పాలమూరును వాడొచ్చి, వీడొచ్చి పాలమూరును దత్తతు తీసుకుంటామని అనే వారు. ఆనాడు చంద్రబాబు నాయుడు, రోశయ్య, కిరణ్‌కుమార్ రెడ్డి కావచ్చు..కెసిఆర్ కావచ్చు. పాలమూరును దత్తత తీసుకుంటామనే వారు..కానీ ఇవ్వాల పాలమూరు బిడ్డగా చెబుతున్నా ..ఎవడి దయా దాక్షిణ్యాలు అవసరం లేదు..దత్తత తీసుకోవాల్సిన అవసరం లేదు. మా వాడే ..రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యిండు..సంతకాలు పెడుతుంటే కాళ్లల్లో కట్టెలు పెడుతున్నారు’ అని ఆరోపించారు. ఎవడో పాలమూరు దత్తత తీసుకోవడమేందని మనం నిధులు తెచ్చుకోలేమా, మనం పాలన చేసుకోలేమా అని అన్నారు. పదేళ్లలో బిఆర్‌ఎస్ వాళ్లు ఏమీ చేయలేదన్నారు. బిఆర్‌ఎస్ వాళ్ల దగ్గర రూ.20 లక్షల కోట్లు ఉన్నాయి.. ఇక్కడి ప్రాజెక్టులకు రూ.20 వేల కోట్లు ఖర్చు చేయలేక పోయారా అని ప్రశ్నించారు. ఎవరేమనుకున్నా పాలమూరుకు లా కాలేజి, ఇంజనీరింగ్ కాలేజి, కొడంగల్‌లో మెడికల్ కళాశాలను మంజూరు చేసినట్లు తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కూడా త్వరలో పూర్తి చేస్తామని సిఎం హామీ ఇచ్చారు.

పాలమూరుకు రూ.100 కోట్లు ః
‘వేదికపైన ఉన్న మా పెద్దలు, మంత్రులు సాక్షిగా చెబుతున్నా.. పాలమూరు ఎన్నో కష్టాలు,కన్నీళ్లతో బాధపడింది. చనిపోతే కూడా తలమీద నీళ్లు పోసుకోవడానికి కూడా నీరు లేకపోయేది.. నీళ్లు లేని బతుకులు బతికినం..ఇవ్వాల మన పెద్దలు సహకరిస్తారు. ఏడాదికి రూ. 20వేల కోట్లు తెచ్చుకుంటే పాలమూరు పసిడి పంటలతో కళకళలాడుతుందని రేవంత్ అన్నారు.
‘ఇవాల కాళేశ్వరంనకు రూ. 1.20 కోట్లు కెసిఆర్ తీసుకెళ్లి కాంట్రాక్టర్లకు కమీషన్లకు ఇచ్చుకున్నారు. ఆ ప్రాజెక్టు కుప్పకూలింది. ఆ నాడు నెహ్రూ కట్టిన శ్రీశైలం కాని, జూరాల, నాగార్జునసాగర్ కాని, శ్రీరాం సాగర్ కాని, శ్రీపాద యల్లంపల్లి చూడాలని’ అన్నారు. ఎన్ని తుఫాన్లు వచ్చినా, భారీ వర్షాలు వచ్చినా నిలబడ్డాయని అన్నారు. కెసిఆర్ కమీషన్లు మెక్కిన కాళేశ్వరానికి లక్షకోట్లు తీసుకెళ్తే,..తాను పుట్టిన గడ్డ కోసం, తాను అడిగితే తన మిత్రులు ఇవ్వారా అని అన్నారు.

లగచర్లలో చిచ్చుపెడుతున్నారు.ః
కొడంగల్ నుంచి గెలిచిన తాను నియోజకవర్గ రుణం తీర్చుకోవాలని 1300 ఎకరాలు భూసేకరణ చేసి ఇండస్ట్ట్రియల్ పార్కుతెచ్చి 30 వేల మంది ఈ ప్రాంత నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని పెద్ద పెద్ద కంపెనీలు తెస్తే తన జన్మ ధన్యం అవుతుందని తలచానన్నారు. తెలంగాణలో 2 కోట్ల ఎకరాల భూమి ఉంది.. కొడంగల్‌లో 1300 ఎకరాల భూమిని సేకరించి పారిశ్రామికవాడను తీసుకొస్తుంటే చిచ్చుపెట్టించి ..అధికారులపై, కలెక్టర్లపై దాడులు చేయించి అమాయక లంబాడ సోదరులను జైళ్లకు పంపించారని మండిపడ్డారు. వారి మాయమాటలు నమ్మవద్దని, వారు ఉచ్చులోకి దించుతారని ఆ రోజు చెప్పినట్లు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో అగ్గిపెట్టెరావు వంద రూపాయలు పెట్టి పెట్రోల్ తెచ్చుకున్నాడు కాని పది పైసలు పెట్టి అగ్గిపెట్టె తెచ్చుకోలేదని ఎద్దేవా చేశారు. అలాంటి అగ్గిపెట్టె రావును నమ్మవద్దని కోరానని అన్నారు. ఈరోజు వచ్చి కేసులు తీయమంటున్నారు. ‘నా మీదనే బొలెడు కేసులున్నాయని చెప్పాను.

చట్టం వేరు.. సిఎం వేరు’ అన్నారు. ‘మీ 1300 ఎకరాలు గుంజుకొని నేను ఎక్కడికి తీసుకెళ్తానని నాకేమీ అవసరం లేదు’ అని అన్నారు. కొడంగల్ ఆడబిడ్డలు, నిరుద్యోగులకు పరిశ్రమలు స్థాపించి పరిశ్రమలు తీసుకొస్తుంటే అడ్డుకుంటున్నారన్నారు. ‘ఈయాల కెసిఆర్‌కు గజ్వేల్‌లో 1000 ఎకరాలు ఉండవచ్చుకాని మాకు 1300 ఎకరాలు భూసేకరణ అవసరం లేదా అని నిలదీశారు. ఆరోజు నాగార్జునసాగర్ కడితే రైతులు మునగ లేదా, శ్రీశైలం కడితే కొల్లాపూర్ రైతులు మునగ లేదా ? పాలమూరు రంగారెడ్డి కడితే మూడుసార్లు భూములు పోయినోళ్లు సహాయం అడిగారు తప్ప పౌరుషం లేక పోయిందా కొట్టమంటే కొట్టలేక పోతుండేవారా’ అని నిలదీశారు. భూమి అనేది అమ్మలాంటింది. ఆత్మగౌరవం, భూమితో ఎంత అనుబంధం ఉంటుందో అంతే అనుబంధం అన్నారు. లగచర్ల రైతులకు అడిగినంత నష్టపరిహారం ఇస్తాం. కెటిఆర్, హరీశ్‌రావు అడ్డుకుంటున్నారు. వారికి ఫాంహౌస్‌లు ఉన్నాయి. నష్టపోయేది మీరనని లగచర్ల రైతులకు విజ్ఞప్తి చేశారు. ఎకరాకు రూ. 20 లక్షలు ఇస్తాం ..తీసుకోవాలని కోరారు. ఈ జిల్లాలో ప్రాజెక్టులు కట్టి, పరిశ్రములు తెస్తుంటే అడ్డుకుంటున్నారని ఆరోపించారు.

కెసిఆర్ అప్పుకు రూ.60 వేల కోట్లు వడ్డీ కడుతున్నాంః
‘54 వేల కోట్ల రూపాయలు మేము రైతుల కోసం ఖర్చుపెడితే, కెసిఆర్ చేసిన 7 లక్షల రూపాయల అప్పునకు మా డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క రూ. 60 వేల మిత్తి కట్టారు’ అని అన్నారు. ఆ అప్పును కెసిఆర్ చేయకపోయి ఉంటే.. ఆ డబ్బులను రైతులకు పంచితే కష్టాలు తీరేవన్నారు. కెసిఆర్ దోపిడీ ఎలా సాగిందో గమనించాలన్నారు. ‘గత ప్రభుత్వం హయాంలో మల్లన్నసాగర్‌లో మల్లారెడ్డి అనే రైతు చితి పేర్చుకొని చనిపోతే నీ కన్నీళ్లు ఎక్కడికి పోయాయి’ అని హరీశ్‌రావుని నిలదీశారు. ‘నీ కపట ప్రేమ మాపై చూపించవద్దు.. నేను ఈ జిల్లాకు సిఎం అయి ఉండి ఈ జిల్లాకు ఏమీ చేయలేకపోతే చరిత్ర క్షమించదు… ఎవరు అడ్డు వచ్చినా పాలమూరుకు నిధుల వరద పారిస్తా’ అని అన్నారు

. ‘కొడంగల్‌లో 20 వేలమందికి ఉద్యోగాలిస్తాం. నేను పుట్టింది పెరిగింది నల్లమల్ల అడవిలో పులులను చూసిన.. తోడేళ్లను చూసి.. మానవ మృగాలను చూసిన..మీరెంత.. నాకు కాలిగోటితో సమానమని సిఎం అన్నారు. బహిరంగసభలో డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, పిసిసి చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తం కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంటకరెడ్డి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎంఎల్‌ఎలు యన్నం శ్రీనివాస్ రెడ్డి, అనురుధ్‌రెడ్డి, జి.మధుసూదన్ రెడ్డి, మేఘారెడ్డి, వాకిట శ్రీహరి, ఫర్నీకారెడ్డి, ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News