Saturday, December 21, 2024

తొమ్మిదో అంతస్థులోకి సిఎం రేవంత్‌రెడ్డి చాంబర్..!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన చాంబర్‌ను తొమ్మిదో అంతస్థులోకి మార్చుకోనున్నట్టు తెలిసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి గా అనుముల రేవంత్ రెడ్డి 2023 డిసెంబర్ 7వ తేదీన బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ సచివాలయంలో ప్రస్తుతం ఆరో అంతస్తులో రేవంత్ రెడ్డి చాంబర్ ఉంది. అయితే ఈ చాంబర్ నుంచి 9వ అంతస్తులోకి మారాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. తెలంగాణ సచివాలయంలోని 9వ అంతస్తును రేవంత్ రెడ్డి శనివారం పరిశీలించారు. రేవంత్ రెడ్డికి తొమ్మిది లక్కీ నెంబర్. దీంతో 9వ ఫ్లోర్‌లోకి రేవంత్ రెడ్డి మారనున్నారు.

9వ ఫ్లోర్ లో రేవంత్‌రెడ్డి చాంబర్‌లో అవసరమైన ఇంటీరియర్, ఫర్నీచర్‌ను అధికారులు సిద్ధం చేస్తున్నారు. తెలంగాణలో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కొత్త సచివాలయ భవనాన్ని నిర్మించారు. 28 ఎకరాల విస్తీర్ణంలో 265 అడుగుల ఎత్తుతో ఈ నిర్మాణాన్ని చేపట్టారు. 11 అంతస్తుల సచివాలయంలో 6వ అంతస్తులో పరిపాలన కేంద్రీకృతం అయ్యింది. సిఎం కార్యాలయం, మంత్రివర్గ సమావేశ హాల్ ఆరో అంతస్తులో సిఎం చాంబర్‌ను ఏర్పాటు చేశారు. మంత్రుల కార్యాలయాలను 2 నుంచి 5 అంతస్తుల్లో ఏర్పాటు చేశారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News