Monday, December 23, 2024

23శాతం బడ్జెట్ తగ్గింది… అబద్ధాలతో బడ్జెట్ పెట్టలేదు: సిఎం రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అబద్ధాలతో మేము బడ్జెట్ పెట్టలేదని…మొదటి రోజే నిజం చెప్పాలనుకున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత సిఎం చాంబర్ లో రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత బడ్జెట్ కంటే రూ.70వేల కోట్లు తగ్గించామన్నారు. ఈ సారి 23శాతం బడ్జెట్ తగ్గిందని చెప్పారు. గతంలో బడ్జెట్లు అబద్ధాలతో నడిపించారని అన్నారు. మేము మొదటి రోజే నిజం చెప్పాలి అనుకున్నామని.. అందుకే వాస్తవిక బడ్జెట్ ను ప్రవేశపెట్టామని చెప్పారు.

గతంలో ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ లో రూ.16వేల కోట్లు అప్పులు కట్టారని తెలిపారు. అక్కర లేకున్నా.. పిలిచిన టెండర్లు రద్దు చేస్తామని సిఎం చెప్పారు. త్వరలోనే రుణమాఫీ చేస్తామని.. దీనికోసం బ్యాంక్ లతో చర్చలు జరుగుతున్నాయన్నారు. ఇరిగేషన్ పై శ్వేత పత్రంతోపాటు కాగ్ నివేదిక అసెంబ్లీలో పెడతామని చెప్పారు.

మేడిగడ్డకు ప్రతిపక్ష నాయకులను కూడా పిలుస్తామని సిఎం రేవంత్ అన్నారు. ప్రస్తుతం మేడిగడ్డపై విజిలెన్స్ విచారణ జరుగుతోందని.. తరువాత జుడిష్యల్ ఎక్వరిలో దోషులు తెలుతారన్నారు. కాళేశ్వరం టూర్ కు ప్రతిపక్ష నాయకుడుకి ఎప్పుడు టైం ఉందో చెప్పాలని.. ఒక రోజు ముందు వెనుక అయినా మేము రెడీగా ఉన్నామని సిఎం రేవంత్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News