Sunday, December 22, 2024

కాళేశ్వరంపై విచారణకు ప్రభుత్వం ఎందుకు మౌనం

- Advertisement -
- Advertisement -

గత పాలకులతో సిఎం రేవంత్‌రెడ్డి కుమ్మక్కు: బిజెపి నేత డికె అరుణ

మన తెలంగాణ/హైదరాబాద్ : దేశంలోనే అతిపెద్ద కుంభకోణం కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగిందని, గతంలో సీబీఐ విచారణ కోరిన కాంగ్రెస్ ఇప్పుడు ఎందుకు మౌనంగా వహిస్తుందని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె. అరుణ ప్రశ్నించారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ జ్యూడిషియల్ విచారణతో కాలయాపన చేయాలని చేస్తోందని, కాళేశ్వరం ప్రాజెక్ట్ పై లక్ష కోట్లకు అంచనాలు పెంచి వేలకోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.

కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్త శుద్ధి ఉంటే గత ప్రభుత్వం తెచ్చిన జీవోలను రద్దుచేసి వెంటనే సిబిఐ తో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహార శైలి చూస్తుంటే గత పాలకులను కాపాడాలని చూస్తున్నారనే అనుమానం కలుగుతుందని, గతంలో సిబిఐ విచారణ జరిపించాలంటూ చెప్పి అధికారం చేపట్టగానే మాట మార్చారని మండిపడ్డారు. ప్రాజెక్ట్ రీడిజైన్ పేరుతో గత ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగా ప్రాజెక్ట్ వ్యయాన్ని సుమారు రూ. 63 వేల కోట్ల నుండి రూ.1.50 లక్షల కోట్లకు పెంచిందన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించడం కంటే సిబిఐ విచారణ జరిపిస్తే నిజ నిజాలు బయటపడతాయని,గత ప్రభుత్వం పెద్దఎత్తున అవినీతికి పాల్పడిందని గతంలో రేవంత్ రెడ్డి ఆరోపించిన ఇప్పుడు ఎందుకు తోక్కముడిచారని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్ర మంత్రులను విమర్శించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు నిశబ్దంగా ఎందుకున్నారో సమాధానం చెప్పాలన్నారు. మేడిగడ్డ, కాళేశ్వరం నిర్మాణం తదితర కుంభకోణాలపై దర్యాప్తు చేయించడంలో కాంగ్రెస్ జాప్యం చేస్తోందని, కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏదో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.

ప్రాజెక్టుపై 2019 జూన్ తరువాత ప్రాజెక్టులో లోపాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయని, 2020 జూలై 9న భూపాలపల్లి జిల్లాలోని గ్రావిటీ కెనాల్ గోడ సిమెంట్ పెచ్చులూడాయన్నారు. 2022 జూలై 14న గోదావరిలో వచ్చిన భారీ వరదలకు కాళేశ్వరం సమీపంలోని లక్ష్మీ పంపుహౌస్, అన్నారం పంపుహౌస్ నీట మునిగాయన్నారు. పంపుహౌ స్‌ల నీట మునుగకు ప్రధాన కారణం నిర్మాణంలో నాణ్యత, డిజైన్ లోపమే అనే ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News