Sunday, January 19, 2025

ప్రభుత్వాన్ని పడగొడుతుంటే.. చూస్తూ ఊరుకుంటామా?: సిఎం రేవంత్

- Advertisement -
- Advertisement -

తాము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఫిరాయింపులకు పాల్పడలేదని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలుస్తామని బిఆర్ఎస్, బిజెపి నేతలు పదే పదే అంటున్నారు. వాళ్లు ప్రభుత్వాన్ని పడగొడుతుంటే.. చూస్తూ ఊరుకుంటామా? అని సిఎం ప్రశ్నించారు. కుక్కకాటుకు చెప్పుదెబ్బ అని పెద్దలు చెప్పారు.. కొట్టకుండా ఊరుకుంటామా? అన్నారు. ఈ రోజు నుంచి తాను రాజకీయం ప్రారంభించానని చెప్పారు. ఎన్నికల నగారా మోగింది కాబట్టి.. పార్టీ అధ్యక్షుడిగా తన పని ప్రారంభించానన్నారు. ఫోన్ ట్యాపింగ్ పై కేంద్రానికి చిత్తశుద్ది ఉంటే విచారణకు ఆదేశించాలన్నారు. ఈటల రాజేందర్ ఆరోపణలు మాని.. విచారణ జరిపించేలా చేయాలని సిఎం రేవంత్ డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News