Thursday, December 26, 2024

ఒకటో తేదీన ఉద్యోగులకు జీతాలు ఇచ్చాం

- Advertisement -
- Advertisement -

ప్రజలు ఇబ్బందులు పడితే బాగుండని విపక్షం కోరుకుంటోందని సిఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. పిల్లి శాపనార్థాలకు ఉట్టి తెగిపడదని ఆయన అన్నారు. ఒకటో తేదీన ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితికి రాష్ట్రాన్ని దిగజార్చారని గత ప్రభుత్వంపై ఆయన విమర్శలు చేశారు. పరిస్థితిని చక్కదిద్దుతూ ఈ ప్రభుత్వం ఒకటో తేదీన ఉద్యోగులకు జీతాలు ఇచ్చిందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనర్‌లకు ఈ నెల 1వ తేదీన జీతాలు ఇచ్చామని సిఎం రేవంత్ తెలిపారు.

మంచి పనులకు అభినందించే సద్బుద్ధి కూడా విపక్షాలకు లేదని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఉద్యోగుల జీతాలు, పెన్షన్‌ల కోసం రూ. 4 వేల 8 వందల కోట్లను విడుదల చేశామని సిఎం రేవంత్ అన్నారు. రాష్ట్రంలో ఈ నెల 85 శాతం వృద్ధాప్య పెన్షన్ లు లబ్ధిదారుల ఖాతాలో జమచేశామని, మిగతా 25 శాతం పెన్షన్లు ఈనెల 15 తేదీ వరకు ఖాతాల్లో వేస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News