Tuesday, September 17, 2024

ఇంజనీరింగ్‌ను నీరుగార్చొద్దు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: పదేళ్లు ఉద్యోగాల కోసం యువత కొట్లాడారని కానీ, ఇప్పుడు పరీక్షల వాయిదా కోసం కొన్ని రాజకీయ శక్తులు, కొన్ని కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు ఆమరణ దీక్షలు చేస్తున్నారని సిఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. త్వరలోనే జాబ్ క్యాలండర్‌ను తీసుకురాబోతున్నామని రేవంత్ రెడ్డి అన్నారు. యూపిఎస్సీ తరహా లో ప్రతి ఏటా క్యాలండర్ ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. జేఎన్టీయూ ఆధ్వర్యంలో నిర్వహించి న ‘క్వాలిటీ ఇంజనీరింగ్ సదస్సు’కు ముఖ్య అతిథులుగా సిఎం రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బా బులు హాజరయ్యారు. ఇంజనీరింగ్ విద్యపై విద్యాసంస్థల యాజమాన్యాలతో ముఖాముఖి ఏర్పాటు చేశా రు.

ఈ కార్యక్రమంలో భాగంగా గ్లోబల్ ఏఐ సమ్మిట్ హైదరాబాద్ -2024 లోగోను సిఎం రేవంత్ విడుదల చేశారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్ మాట్లాడుతూ తమ ప్రభుత్వానికి భేషజాలు లేవని, నిరుద్యోగులకు మేలు జరిగేలా ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయని ఆ యన తెలిపారు. నోటిఫికేషన్ల ప్రకారమే ప్రభుత్వం పరీక్షల విద్యాసంస్థలు రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారకూడదన్నదే తమ ప్రభుత్వ విధానమని, తాము అధికారంలోకి వచ్చిన మొదటి 30 రోజుల్లోనే 30వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, ఆర్థిక భారం, ఇతర సమస్యలున్నా ఒక్కొక్కటి పరిష్కరించుకుంటూ తమ ప్రభు త్వం ముందుకు వెళుతోందని సిఎంతెలిపారు.

రీయింబర్స్‌మెంట్‌పై త్రిముఖ వ్యూహం
ఈ విద్యా సంవత్సరం నుంచి బకాయిలు లేకుండా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అందిస్తామని ఆయన ప్రకటించారు. రకరకాల పరిస్థితుల్లో ప్రాధాన్యతలు మారి ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పేరుకుపోయాయని, పాత బకాయిలపై ఎలా ముందుకెళ్లాలన్న అంశాన్ని పరిష్కరించే బాధ్యత మంత్రి శ్రీధర్ బాబుకు అప్పగిస్తున్నామని సిఎం రేవంత్ అన్నారు. ఫీజు రీ యింబర్స్‌మెంట్‌పై త్రిముఖ వ్యూహాంతో తమ ప్రభు త్వం ముందుకు వెళుతుందన్నారు. జేఎన్టీయూ పరిధి లో కళాశాలలు నిర్వహిస్తున్నా సిబ్బందికి ప్రభుత్వ వి ధానం తెలియాలన్న ఉద్ధేశ్యంతో ఈ కార్యక్రమం ని ర్వహించామని ఆయన తెలిపారు. తొలిసారి ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానం ప్రవేశపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు.

ఇంజనీరింగ్ కాలేజీలకు సాయం
ప్రపంచంలోని దేశాల్లో ఏదైనా గొప్పగా ఉందంటే అది ఇంజనీర్లు చేసిందేనని సిఎం రేవంత్ ప్రశంసించారు. తెలంగాణలోని ఇంజనీరింగ్ కాలేజీలకు సాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈ సం దర్భంగా రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. నిరుద్యోగుల ను తయారు చేసే పరిశ్రమలుగా కళాశాలలు ఉండకూడదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అభివృద్ధి చెందుతున్న దేశానికి అత్యంత అవసరమైందని సివిల్ ఇంజనీరింగ్ అని, అలాంటింది కొన్ని కళాశాల ల్లో సివిల్ ఇంజనీరింగ్ లేకుండా చేసే విధంగా ప్రణాళికలు చేస్తున్నారని సిఎం రేవంత్ అసహనం వ్యక్తం చేశారు. ఇంజనీరింగ్ కాలేజీల్లో కచ్చితంగా సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ కోర్సులను నడపాలని సిఎం రేవంత్ సూచించారు. ఇంజనీరింగ్ కాలేజీల్లో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఈ మూడు కోర్సులు లేకపోతే దేశం ప్రమాదాన్ని ఎదుర్కొంటుందని ఆయన వ్యా ఖ్యానించారు. ఇంజనీరింగ్ కళాశాలలు ఉద్యోగాలు సృష్టించే సంస్థలుగా కాకుండా మేధావులను అందిం చే సంస్థలు ఉండాలని ఆయన సూచించారు. గత సి ఎంలు తీసుకున్న విధానాల వల్ల మనం ఐటీ, ఫార్మా రంగాల్లో ముందు ఉన్నామని ఆయన వ్యాఖ్యానించా రు. భవిష్యత్ అవసరాలను

దృష్టిలో పెట్టుకొని ఇంజనీరింగ్ కాలేజీల్లో కోర్సులు ఉండాలని, ఫార్మా, ఐటి, ఏఐ ప్రపంచాన్ని నడిపించబోతోందని జోస్యం చెప్పారు. రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాల్లో ఏఐకి సంబంధించిన కోర్సు ప్రవేశపెట్టాలని సూచించారు. ఏఐకి అనుసంధానంగా కోర్సులు ప్రవేశపెడితే ప్రభుత్వం ప్రోత్సాహాకం అందిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. త్వరలోనే రాష్ట్రంలో స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని, ఆ వర్సిటీకి అటానమస్ హోదా ఇస్తామని సిఎం రేవంత్ వెల్లడించారు. స్కిల్ డెవలప్‌మెంట్‌లో భాగంగా టాటా భాగస్వామ్యంతో రూ.2400 కోట్లతో ప్రభుత్వం ఐటీఐల రూపురేఖలు మారుస్తున్నామన్నారు. ఫార్మా, ఐటీ తరువాత ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ప్రపంచాన్ని నడిపించబోతుందన్నారు. పక్కా రాష్ట్రాలతో కాకుండా ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా మనం ఉండాలని సిఎం పేర్కొన్నారు.

పొంతన లేకుండా అకాడమిక్ సిలబస్‌లు
పుస్తకాల్లో చదువులకు, బయట సమాజానికి ఏమాత్రం పొంతన లేకుండా ప్రస్తుతం అకడమిక్ సిలబస్‌లు ఉన్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రతి ఏటా లక్షల మంది ఇంజనీరింగ్ స్టూడెంట్లు పట్టాలు తీసుకుంటున్నారే తప్పా వారిలో పనితనం ఉండటం లేదని ఆయన అన్నారు. ప్రపంచ దేశాల విద్యార్థులతో పోటీ పడే విదంగా టెక్నికల్ కోర్సులు సిలబస్ మారాలని రేవంత్ రెడ్డి కోరారు. ప్రభుత్వానికి భేషజాలు లేవు, నిరుద్యోగులకు మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకుంటామన్నారు. నోటిఫికేషన్ల ప్రకారమే ప్రభుత్వం పరీక్షల నిర్వహణ ఉంటుందన్నారు. విద్యాసంస్థలు రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారకూడదన్నదే తమ ప్రభుత్వ విధానమని ఆయన వివరించారు. ప్రస్తుతం సంక్షేమమే మొదటి ప్రియారిటీగా ఉందని ఆ తర్వాతే అభివృద్ధి అని ఆయన వివరించారు.

ఫార్మా, ఐటీ తర్వాత ఏఐ ప్రపంచాన్ని నడిపించబోతుంది….
60 లక్షల నిరుద్యోగులు ఉన్న ఈ రాష్ట్రంలో ఇతర ప్రాంతాల నుంచి ఉపాధి పొందుతున్నారని సిఎం పేర్కొన్నారు. ఫార్మా, ఐటీ తర్వాత ఏఐ ప్రపంచాన్ని నడిపించబోతోందన్నారు. ప్రపంచమంతా ఆసక్తిగా చూస్తున్న ప్రతిష్టాత్మకమైన గ్లోబల్ అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సదస్సును ఈ ఏడాది సెప్టెంబర్ 5, 6 తేదీల్లో హైదరాబాద్‌లోని హెచ్‌ఐసిసిలో నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ సదస్సును హైదరాబాద్ వేదికగా నిర్వహించటం గర్వంగా ఉందని ఆయన అన్నారు. రాష్ట్రంలోని కళాశాలల్లో ఏఐకి సంబంధించిన కోర్సు ప్రవేశపెట్టాల న్నారు. ఏఐకి సంబంధించిన కోర్సులు ప్రవేశపెడితే ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. తమ ప్రభుత్వం నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకే కృషి చేస్తుందన్నారు. సాంకేతిక ఆవిష్కరణలతో మన రాష్ట్రాన్ని మరింత ముందంజలో ఉంచేందుకు ఈ సదస్సు దోహదపడుతుందన్నారు.

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కృత్రిమ మేథా రంగ నిపుణులు, ఐటీ ఆవిష్కర్తలను ఈ సందర్భంగా హైదరాబాద్‌కు ఆహ్వానిస్తు న్నామని ఆయన చెప్పారు. ‘మేకింగ్ ఏఐ వర్క్ ఎవ్రీ వన్’ అనే ఇతి వృత్తంతో ఈ ఏడాది సదస్సును ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమాజానికి ఎలా ప్రయోజనం చేకూరుస్తుందో, ఎలా సాధికారత కల్పిస్తుందో అన్వేషించటమే లక్ష్యంగా ఈ సదస్సు జరుగుతుందన్నారు. దాదాపు రెండు వేల మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరవుతారని సిఎం రేవంత్ తెలిపారు. తమ ప్రభుత్వం నిరుద్యోగులకు సంబంధించిన ప్రణాళికలను సిద్ధం చేస్తుందన్నారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలు ఎలాంటి సమస్యలు లేకుండా నిర్వహించామన్నారు. నోటిఫికేషన్ ఇచ్చిన ప్రకారమే గ్రూప్1 ప్రిలిమ్స్ నిర్వహిస్తామని సిఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

2030 నాటికి ఐటీ రంగంలో కర్ణాటకను అధిగమిస్తాం: మంత్రి శ్రీధర్‌బాబు
ఏఐ పరిజ్ఞానంతో కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు, ప్రపంచంలో ఉన్న సవాళ్లను పరిష్కరించేందుకు వీలుగా ఏఐ సామర్థ్యాలను అన్వేషించేందుకు సెప్టెంబర్‌లో జరిగే సదస్సు కీలక వేదికగా ఉపయోగ పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో జరిగే ఈ సదస్సు అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ రంగంలో తెలంగాణ భవిష్యత్తుకు, కొత్త ప్రాజెక్టులకు నాంది పలుకనుంది. ఈ సదస్సుకు సంబంధించిన అధికారిక వ్బ్సైట్ ను త్వరలోనే ప్రారంభించనున్నారు.2030 నాటికి ఐటీ రంగంలో కర్ణాటకను అధిగమిస్తామని ఐటీ శాఖ మంత్రి తెలిపారు. 200 ఎకరాల్లో ఏఐ సిటీని నిర్మిస్తున్నామని ఆయన అన్నారు. మంచి సలహాలు ఇస్తే అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి శ్రీధర్ బాబు విద్యావేత్తలను కోరారు. రాబోయే రోజుల్లో సాఫ్ట్ వేర్ రంగంలో మనమే ముందుంటామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News