Monday, November 18, 2024

మోడీ- కేడీ తెలంగాణకు అన్యాయం చేసిండ్రు : సిఎం రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

మహబూబాబాద్: లోక్ సభ ఎన్నికల్లోనూ సిపిఐ, సిపిఎం, జనసమితి పార్టీల మద్దతు తీసుకున్నామని ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ మహబూబాబాద్ లో నిర్వహించిన బహిరంగసభలో సిఎం మాట్లాడుతూ… ప్రజాస్వామ్యానికి రక్షించడానికి పార్లమెంటు ఎన్నికల్లో విజయం చాలా అవసరం అన్నారు. ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరుతుంది, రాహుల్ గాంధీ ప్రధానిగా ప్రమాణం చేస్తారని సిఎం స్పష్టం చేశారు. మానుకోట కాంగ్రెస్ పార్టీకి ఎప్పటికీ కంచుకోట అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. విభజన చట్టం ప్రకారం ఇవ్వాల్సినవి కూడా బిజెపి సర్కార్ ఇవ్వలేదని ఆయన ఆరోపించారు.

బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేదన్నారు. మోడీ- కేడీ కలిసి తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశారు.. అసెంబ్లీ ఎన్నికల్లో కేడీని బండకేసి కోట్టారన్నారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన మోడీని కూడా గద్దె దించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కెసిఆర్ దోపిడీకి ఢిల్లీలోని మోడీ సహకరించారు. కాళేశ్వరం రూ. లక్ష కోట్ల దోపిడీని మోడీ చూస్తూ కూర్చున్నారని ఆరోపించారు. కాజీపేటకు రావాల్సిన కోచ్ ఫ్యాక్టరీని మోడీ ఉత్తరాదికి తరలించకుపోయారని సిఎం పేర్కొన్నారు. మోడీ ప్రభుత్వం పదేళ్లు తర్వాత గిరిజన యూనివర్సిటీని ప్రకటించింది. తెలంగాణ ఏర్పాటును ప్రధాని మోడీ ఎన్నోసార్లు అవమానించారన్నారు. తెలంగాణ ఏర్పాటు చెల్లదని పార్లమెంటు సాక్షిగా మోడీ అన్న విషయాన్ని సిఎం గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పాటునే ప్రశ్నించిన బిజెపికి ఎందుకు ఓటు వేయాలో చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. మేడారం జాతరకు కేంద్రం ముష్టి మూడు కోట్లు ఇచ్చింది.. కుంభమేళాకు వేల కోట్లు ఖర్చ చేసిన మోడీ సర్కార్ మేడారం జాతరకు రూ. కోట్లు ఎట్లా ఇచ్చిందని ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News