Monday, December 23, 2024

ట్యాపింగ్ చేసిన వారికి.. చిప్పకూడు తప్పదు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : ట్యాపింగ్ చేసిన వారికి చిప్పకూడు తప్పదని, కెటిఆర్ బరితెగించి మాట్లాడుతున్నారని, కొన్ని ఫోన్లు విన్నామని కెటిఆర్ చెబుతున్నారని వింటే చర్లపల్లిలో చిప్పకూడు తినాల్సి వస్తుందని సిఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఫోన్ ట్యాపింగ్‌పై విచారణ జరుగుతోందని అన్నారు. ఎవరైనా ఇతర కుటుంబ సభ్యుల కాల్స్ వింటారా అని సిఎం ఈ సంద ర్భంగా ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై రేవంత్ రెడ్డి తొలిసారి స్పందించారు. శుక్రవారం గాంధీభవన్‌లో సిఎం రేవంత్ రెడ్డి వాల్మీకి, బోయలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కెటిఆర్ తాగుబోతుల్లా, అచ్చోసిన ఆంబోతులా మాట్లాడుతున్నారని ఫలితం అనుభవిస్తారని ఆయన మండిపడ్డారు. బిఆర్‌ఎస్ నేతలు చెప్పినట్లు విన్న అధికారుల పరిస్థితి ఇప్పుడెలా ఉందో చూస్తున్నామన్నారు. గత ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ చేసి భార్యాభర్తలు ఏం మాట్లాడుకున్నారో కూడా విన్నారని రేవంత్ తెలిపారు. గత ప్రభుత్వం ఫోన్ ట్యాపి ంగ్‌తో దుర్మార్గం చేసిందని, ప్రజలను భయబ్రాంతులకు గురి చేసిందని, ఫోన్ ట్యాపింగ్‌తో కెసిఆర్ కొంతమంది సంసారాల్లో వేలు పెట్టాడని సిఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఫోన్ ట్యాపింగ్‌పై అధికారులకు ఆ రోజే చెప్పానని వారు వినలేదని, ఇవాళ పోలీసు అధికారులు జైలుకు వెళ్తే అటు వైపు బిఆర్‌ఎస్ నాయకులు చూడటం లేదని రేవంత్ అన్నారు.వాల్మీకి, బోయల డిమాండ్‌ను నెరవేరుస్తామని అందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని సిఎం రేవంత్ అన్నారు. గత ప్రభుత్వం ఓట్లేసిన ప్రజలపైనే కేసులు పెట్టిందని ఆయన ఆరోపించారు. ఎంపి ఎన్నికల్లో మహబూబ్ నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ను దెబ్బతీసే కుట్ర జరుగుతోందని, అయితే ఇది వంశీ చందర్ రెడ్డి, మల్లు రవినో దెబ్బ తీసే కుట్ర కాదని నేరుగా రేవంత్ రెడ్డిని దెబ్బతీయాలని బిజెపి, బిఆర్‌ఎస్‌లు ఏకమయ్యాయని సిఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. మహబూబ్ నగర్‌లో కాంగ్రెస్‌ను ఓడిస్తే రాష్ట్రమంతటా నన్ను తిట్టవచ్చన్న ఆలోచనతో ఈ రెండు పార్టీలు కుమ్మక్కయ్యాని, ఈ విషయం వారి పార్టీలోని మన అభిమానులే చెప్పారన్నారు. కాంగ్రెస్‌ను కాదని మరో పార్టీకి ఓటు వేస్తే ఏదైనా లాభం ఉందా? అని ఆయన ప్రశ్నించారు. పదేళ్లుగా కేంద్రంలో మోడీనే ప్రధానిగా ఉన్నారు కదా అని ఆయన ప్రశ్నించారు. డికె అరుణ బిజెపిలో చేరి జాతీయ పదవి తెచ్చుకున్నారు తప్ప మహబూబ్‌నగర్ జిల్లాకు డికె అరుణ ఏం సాధించారని సిఎం రేవంత్ ప్రశ్నించారు. ఉపాధ్యక్షురాలి హోదాలో పాలమూరు ప్రాజెక్టుకు డికె అరుణ జాతీయ హోదా సాధించవచ్చు కదా అని సిఎం రేవంత్ నిలదీశారు. ఏ ముఖం పెట్టుకుని బిజెపి ఓట్లు అడుగుతుందని మోడీ, బిజెపి నాయకులు ఇక్కడ ఉండే వాళ్లు కాదని వారంతా సంక్రాంత్రి నాడు గంగిరెద్దోలలా ఓట్ల కోసం వచ్చి పోయేటోలేనని సిఎం రేవంత్ విమర్శించారు. మహబూబ్ నగర్ ఎమ్మెల్సీని 200 ఓట్లతో గెలవబోతున్నామని రేవంత్ రెడ్డి ధీమ వ్యక్తం చేశారు.

సంపత్ కు కీలక పదవి
పార్లమెంట్ ఎన్నికలు ముగియగానే అధిష్ఠానంతో మాట్లాడి సంపత్‌కు మంచి పదవి ఇప్పించే బాధ్యత తాను తీసుకుంటానని రేవంత్ హామీ ఇచ్చారు. అంతా సార్ చూసుకుంటారన్న భరోసాతో పండగలు, పబ్బాల పేరుతో జిల్లాలో ఎవరూ నిర్లక్ష్యంగా ఉండవద్దని ఆయన సూచించారు. ఎన్నికలు అయ్యాక తాను సిఎం కార్యాలయాలనికి పిలిపించి వాల్మీకి, బోయల సమస్యలపై చర్చించి అక్కడే ఆదేశాలిస్తానని సిఎం రేవంత్ హామీ ఇచ్చారు. సంక్షేమంలో, అభివృద్ధి, విద్యలో వారికి సముచిత స్థానం కల్పించే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుందన్నారు. వాల్మీకి, బోయలు కాంగ్రెస్‌కు అండగా నిలబడాలని సిఎం సూచించారు.
మూడు నెలల్లో 30వేల ఉద్యోగాలను భర్తీ చేశాం
వందరోజుల్లో ఒక మంచి పరిపాలన అందించామని, పరిపాలనలో దేశంలోనే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని, వందరోజుల పాలనలో పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం పనిచేసిందని సిఎం రేవంత్ తెలిపారు. మూడు నెలల్లో 30వేల ఉద్యోగాలను భర్తీ చేశామని, పదేళ్ల బిఆరెస్ పాలనలో ప్రభుత్వంపై ఉద్యోగులు విశ్వాసం కోల్పోయారన్నారు. ఉద్యోగులకు మొదటి తారీఖు జీతాలు ఇచ్చి ప్రభుత్వంపై విశ్వాసం కల్పించామని సిఎం రేవంత్ తెలిపారు. గడీలను బద్దలు కొట్టి ప్రజా పాలన తీసుకొచ్చామని, మనం ఎన్నుకున్న ప్రభుత్వాన్ని చూసి భయపడేలా ఉండకూడదన్నారు.

ఇది బాక్స్‌లో పెట్టాలి
మన పాలనకు కితాబు
పీఈసీ సమావేశంలో సిఎం రేవంత్
గాంధీ భవన్‌లో పిసిసి అధ్యక్షుడు, సిఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం రాత్రి పీఈసీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సిఎం రేవంత్ మాట్లాడుతూ పార్టీలో కష్టపడిన వారికి సముచిత స్థానం కల్పిస్తున్నామన్నారు. ఇప్పటికే కొందరికి నామినేటెడ్ పదవులు ఇచ్చామని, గతంలో ఎన్నడూ లేని విధంగా ఇంటికే పదవులు ఇస్తున్నట్టు సమాచారం ఇచ్చామన్నారు. శ్రీధర్ బాబు నేతృత్వంలో మేనిఫెస్టో కమిటీకి ఏమైనా సలహాలు ఉంటే ఇవ్వాలని సిఎం సూచించారు. అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గ ఇంఛార్జీలను నియమించి ప్రచార కార్యక్రమాలను చేపట్టాలన్నారు. దేశంలో తెలంగాణ మోడల్ పాలన బాగుందని, మన జాతీయ నాయకత్వం మనకు కితాబు ఇవ్వడం మనకు గర్వకారణమని సిఎం రేవంత్ పేర్కొన్నారు. ‘

రాష్ట్రంలో మెజారిటీ ఎంపి సీట్లు గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజల్లో మంచి స్పందన ఉందని, మనకు మంచి ఫలితాలు వస్తాయని సిఎం రేవంత్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే అన్ని అనుబంధ సంఘాల చైర్మన్‌లకు పదవులు ఇచ్చామని, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు, సలహాదారులు, నామినేటెడ్ పోస్టుల పదవులు పొందిన వారిని అభినందిస్తూ పీఈసీలో తీర్మానం చేశారు. ఏప్రిల్ 6వ తేదీన సాయంత్రం తుక్కుగూడలోని రాజీవ్ గాంధీ ప్రాంగణంలో జనజాతర సభ, ఏఐసిసి మేనిఫెస్టోలో ఉన్న 5 న్యాయ్ గ్యారంటీల ప్రచారాన్ని విస్తృతం చేస్తూ కేంద్రంలో తెలంగాణ కు సంబంధించిన పెండింగ్ పనులను మేనిఫెస్టోలో చేర్చాలని తీర్మానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News