Tuesday, April 29, 2025

అభద్రతాభావంతోనే కెసిఆర్ అక్కసు

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో జరుగుతున్న అనర్ధాలకు కెసిఆర్
బాధ్యత వహించాలి రాష్ట్ర ఖజానాను
లూటీ చేసిందే బిఆర్‌ఎస్ ప్రభుత్వం నేను
సిఎం కాగానే కెసిఆర్ గుండెపగిలింది
నాకు రాహుల్‌తో మంచి మైత్రి ఉంది
బిఆర్‌ఎస్‌ను ప్రజలు నమ్మే స్థితిలో లేరు
కాంగ్రెస్‌లో ఓపిగ్గా ఉంటేనే పదవులు
వస్తాయి.. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే
నష్టపోతారు ఎంఎల్‌ఎలు హైదరాబాద్‌లో
టైంపాస్ చేయడం సరికాదు గ్రామాలకు
వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరించాలి
మీడియాతో చిట్‌చాట్‌లో సిఎం రేవంత్‌రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్: పార్టీ గీత దాటితే ఊరుకునేది లేదని సిఎం రేవంత్ రెడ్డి మరోసారి హెచ్చరించారు. ఎమ్మెల్యే లు హైదరాబాద్‌లో టైంపాస్ చేయడం సరికాదని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షే మ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సిఎం రేవంత్‌రెడ్డి సూచించారు. ఎమ్మెల్యే లు ప్రజల్లోకి వెళ్లాలని, ఎమ్మెల్యేలు వెళితేనే ప్రజల్లోకి పథకాలు వెళతాయని సిఎం రే వంత్‌రెడ్డి పునరుద్ఘాటించారు. పార్టీలో ఓపికగా ఉంటేనే పదవులు వస్తాయని, ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే నష్టపోతారని పేర్కొన్నారు. సోమవారం సిఎం రేవంత్‌రెడ్డి విలేకరులతో చిట్‌చాట్ చేశారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ తనని నమ్ముకున్న వాళ్లని తాను ఎప్పుడూ మర్చిపోనని సిఎం పేర్కొన్నారు. తనని నమ్ముకున్న వా ళ్లలో అద్దంకి దయాకర్ కూడా ఉన్నారని, దయాకర్‌కు ఎమ్మెల్సీ వచ్చిందని ఆయన తెలిపారు. ఓపికతో ఉంటే నాకు వారి గు రించి బాధ్యత ఉంటుందని, నా వెంట ఉం డి బయటకు వెళ్లి ఎవరైనా విమర్శలు చేస్తే తనపై భారం ఉండదని, చెల్లుకు చెల్లు అ యినట్లు ఫీలవుతానని స్పష్టం చేశారు.

నేను సిఎం కాగానే కెసిఆర్ గుండె పగిలింది
తాను సిఎం అయిన రెండో రోజే కెసిఆర్ గుండె పగిలిపోయిందని ఆయన ఆరోపించారు. ఇప్పడు  రాష్ట్రంలో జరుగుతున్న అనర్ధాలకు కెసిఆర్ బాధ్యత వహించాలని, రాష్ట్ర ఖజానాను లూటీ చేసింది కెసిఆర్ అని ఆయన మండిపడ్డారు. కెసిఆర్ స్పీచ్ అంతా అక్కసుతో నిండి ఉందని ఆయన విమర్శించారు. కెసిఆర్ అభద్రతా భావంలో కాంగ్రెస్‌పై అక్కసు వెళ్లగక్కారని సిఎం రేవంత్ ఫైర్ అయ్యారు. ఆయన స్పీచ్‌లో క్లారిటీ లేదన్నారు. కెసిఆర్ సభకు అవసరమైనన్ని బస్సులు సమకూర్చినప్పటికీ, గతంలో ఖమ్మంలో రాహుల్ గాంధీ సభకు బస్సులు ఇవ్వకపోవడం మోసపూరిత చర్య అని ఆయన మండిపడ్డారు.

నాకు రాహుల్ గాంధీతో మంచి మైత్రి ఉంది
నాకు రాహుల్ గాంధీతో మంచి మైత్రి ఉందని, ఇది ఎవరు నమ్మినా, నమ్మకపోయినా నాకు పరవాలేదని సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ విషయం రాహుల్ గాంధీకి తనకు తెలిస్తే చాలనీ, బయట ఎవరేం అనుకుంటున్నారన్నది తనకు అనవసరమని రేవంత్ అన్నారు. రాహుల్ గాంధీకి, నాకు గ్యాప్ ఉందనడం అవాస్తవమని మా ఇద్దరి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ఇతర రాష్ట్రాల్లో అమలు చేయలేకపోయిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

అవసరంగా ఉన్న కారణంగా అధికారుల సేవలను
కొంతమంది అధికారుల పనితీరు తెలిసినా, అవసరంగా ఉన్న కారణంగా వారి సేవలను కొనసాగించాల్సి వస్తోందని సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ అధికారుల విషయంలో ఆచితూచి వ్యవహారించాల్సిన అవసరం ఉంటుందని ఆయన తెలిపారు. అధికారుల్లో తమ వారు వేరే వాళ్లు అంటూ ఉండరని ఆయన అన్నారు. సమర్ధత ఉన్న అధికారులను గత ప్రభుత్వంలో కీలకంగా ఉన్నప్పటికీ కొనసాగించక తప్పదని సిఎం అన్నారు. కొందరు అధికారులు సంపాదనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయన్నారు. కలెక్టర్ల మార్పు వేరే విషయమని, అవసరమైన మార్పులు చేసుకుంటామని ఆయన వివరించారు.

కెసిఆర్ మాదిరిగా తాను చట్టాన్ని అతిక్రమించను
ఫోన్ ట్యాపింగ్ కేసుల గురించి రేవంత్ మాట్లాడుతూ చట్టం ప్రకారమే చర్యలు తీసుకుంటామని, కెసిఆర్ మాదిరిగా తాను చట్టాన్ని అతిక్రమించనని ఆయన అన్నారు. కెటిఆర్ మీద ఉన్న కేసులు కూడా చట్ట ప్రకారమే కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. కక్ష సాధింపు చర్యలకు తాను దిగనని ఆయన చెప్పారు. కాగా, అసెంబ్లీ సమావేశాల్లో తాను చేసిన వ్యాఖ్యలే కెసిఆర్ సభలో పునరావృతం చేశారని ఆయన విమర్శించారు. కెటిఆర్, హరీష్ రావులను చిన్నపిల్లలుగా పేర్కొన్న వ్యాఖ్యలు కూడా కెసిఆర్ తీరుని ప్రతిబింబిస్తున్నాయని ఆయన చెప్పారు.

బిఆర్‌ఎస్‌ను ప్రజలు నమ్మే స్థితిలో లేరు
బిఆర్‌ఎస్‌ను ప్రజలు నమ్మే స్థితిలో లేరని ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న అనర్ధాలకు కెసిఆరే కారణమని సిఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. కెసిఆర్ రాష్ట్ర ఖజానా అంతా ఖాళీ చేసి ఇప్పుడు మాపై నిందలు వేస్తున్నారని సిఎం రేవంత్ ధ్వజమెత్తారు. అవసరాలకు అనుగణంగా కెసిఆర్, మోడీ మాటలు మారుస్తున్నారని ఆయన మండిపడ్డారు. దేశానికి ఇందిరాగాంధీ లాంటి ప్రధాని కావాలని, రెండు దేశాలను ఓడించిన ఘనత ఇందిరాగాంధీదేనని ఆయన తెలిపారు.

ఇకపై పథకాల గ్రౌండింగ్‌పై ఫోకస్ పెడతాం
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలం పథకాల ప్లానింగ్‌కే సరిపోయిందని, ఇకపై పథకాల గ్రౌండింగ్‌పై ఫోకస్ పెడతామని సిఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కెసిఆర్ మాదిరిగా లాంచింగ్ క్లోజింగ్ స్కీములు ఉండవని ఏదైనా ఒక పథకం ప్రారంభిస్తే అర్హులకు అందేవరకు పని చేస్తానని ఆయన అన్నారు. రేవంత్ రెడ్డి చెప్పింది చేస్తారన్న నమ్మకం కలిగేలా పని చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఎన్నికలకు చివరి 6 నెలలు తన పాలనపై చర్చ జరుగుతుందని సిఎం రేవంత్‌రెడ్డి అన్నారు. మరో ఇరవై ఏళ్లు తాను రాజకీయాల్లో ఉంటానని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News