Monday, March 10, 2025

పద్మవిభూషణ్ ఆగాఖాన్ మృతిపై సిఎం రేవంత్ రెడ్డి సంతాపం

- Advertisement -
- Advertisement -

ప్రపంచ ఇస్మాయిలీ ముస్లింల ఆధ్యాత్మిక గురువు, పద్మవిభూషణ్ గ్రహీత ఆగాఖాన్ మృతిపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సంతాపం ప్రకటించారు. ఇస్మాయిలీ ముస్లింల వారసుడిగా ఆధ్యాత్మిక గురువుగా నియమితులైన కరీం అల్-హుస్సేనీ ఆగాఖాన్ మరణం మానవాళికి తీరని లోటని ముఖ్యమంత్రి అన్నారు. గొప్ప సామాజిక వేత్త, మానవతావాదిగా ఆయన ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపును అందుకున్నారని సిఎం పేర్కొన్నారు. ఆగాఖాన్ నెట్ వర్క్ ద్వారా వివిధ దేశాల్లో ఆస్పత్రులు, విద్య, సాంస్కృతిక సంస్థలను నెలకొల్పి

మానవాళికి తన సేవలను అందించా రని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. పేదరిక నిర్మూలన, వారసత్వ సంపద పరిరక్షణకు, వైద్య సేవలు, విద్యా రంగంలో ఆయన అందించిన సేవలు మరిచిపోలేనివని, హైదరాబాద్ కేంద్రంగా ఆగాఖాన్ సంస్థలు నిర్వహిస్తున్న కార్యక్రమాలు ఎంతో గొప్పవని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఆయన జీవితాంతం మానవజాతి గౌరవం పెంచే ఉన్నత విలువలను ఆచరించారని ఆయన కొనియాడారు. వారి వారసులకు, కుటుంబసభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News