Sunday, December 22, 2024

కెసిఆర్‌కు శుభాకాంక్షలు తెలిపిన సిఎం రేవంత్‌ రెడ్డి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్:  మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ శాసనసభలో ప్రతిపక్షనాయకుడు కెసిఆర్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శనివారం నీటిపారుదల శాఖపై శ్వేతపత్రం చర్చలో పాల్గొన్న సిఎం రేవంత్‌ రెడ్డి తొలుత కెసిఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.ఎమ్మెల్యేగా , పార్లమెంట్ సభ్యుడుగా, మంత్రిగా ,ముఖ్యమంత్రిగా 40 ఏళ్లు రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో ప్రతిపక్ష నాయకుడి పాత్రను సమర్ధవంతంగా పోషించాలని , సభను సజావుగా నడిపించటంలో తనవంతు సహకారం అందించాలని, భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News