- Advertisement -
దక్షిణాఫ్రికాపై టీం ఇండియా టీ20 ప్రపంచకప్ టైటిల్ సాధించింది.17 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత టీ 20 ప్రపంచకప్‌ను గెలిచింది. ఈ నేపథ్యంలోనే భారత్ ఘనవిజయం సాధించడంతో సిఎం రేవంత్‌రెడ్డి క్రికెట్ టీంకు శుభాకాంక్షలు తెలిపారు. శనివారం రాత్రి ఉత్కంఠభరితంగా సాగిన ఈ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ గెలుపొందిందని సిఎం రేవంత్ శుభాకాంక్షలు తెలిపారు. టీమిండియా దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టిందని భారత జట్టుపై సిఎం రేవంత్ ప్రశంసల జల్లు కురిపించారు. క్రికెట్ ప్రపంచంలో భారత్‌కు ఎదురులేదని నిరూపించారని రేవంత్ రెడ్డి టీమిండి యాను కొనియాడారు. టి 20 ప్రపంచకప్‌లో మ్యాన్ ఆప్ ద మ్యాచ్ విరాట్ కోహ్లీ నిలవగా, టి 20 ప్రపంచకప్ మ్యాన్ ఆఫ్ టోర్నీగా బుమ్రా నిలిచారు.
- Advertisement -