Tuesday, January 21, 2025

నమ్మించి మోసం చేయడంలో దొందూ..దొందే

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లా, ఆర్మూర్‌లో జరిగిన పసుపు రైతుల దీక్ష తనను రా జకీయంగా ఉన్నత స్థాయికి తీసుకెళ్లిందని పిసిసి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం రాత్రి ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తా వద్ద కాం గ్రెస్ కార్నర్ మీటింగ్‌లో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. తమ సమస్యల పరిష్కారానికి ఆత్మ గౌరవం తో పోరాటం చేస్తారని ఆర్మూర్ ప్రాంత రైతులకు పేరు ఉందని కొనియాడారు. పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న తాను రైతు దీక్షకు ఇక్కడకు వస్తే ఈ ప్రాంత రైతులు తనను అక్కున నేర్చుకొని అం డగా నిలిచారని, అందుకే తనకు కాంగ్రెస్ అధి నేత్రి సోనియాగాంధీ తనను పిసిసి అధ్యక్షుడిగా నియమించారని, చివరికి ముఖ్యమంత్రిగా కూడా అయ్యాయన్నారు.

ఇప్పుడు తాను ఆర్మూర్ గడ్డ పైకి సిఎం హోదాలో వచ్చానని ఎంతో ఆనందం గా చెప్పుకొచ్చారు. 2014 ఎన్నికల్లో చక్కెర ఫ్యాక్టరీని వంద రోజుల్లో తెరిపిస్తానని కెసిఆర్ తనయ కవిత హామీని నమ్మి ఎంపిగా ఆమెను ఇక్కడి ప్రజ లు గెలిపించారని, కానీ పదేళ్లు అయినా ఫ్యాక్టరీ ఊసెత్తలేదని, నమ్మించి మోసం చేశారని ధ్వజ మె త్తారు. తమను నట్టేట ముంచినందుకు అందరూ ఏకతాటిపై వచ్చి 2019లో వంద మంది రైతులు నామినేషన్ వేసి నిరసస వ్యక్తం చేసిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. మాట ఇ చ్చి మోసం చేసిన వారిని బండకేసి కొడతారని కవి త విషయంలో జిల్లా రైతులు రుజువు చేశారని ఆయన గుర్తు చేశారు. ఆ ఎన్నికల్లో ఎంపిగా గెలిచిన బిజెపికి చెందిన ధర్మపురి అర్వింద్ ఐదు రో జుల్లో పసుపు బోర్డు
తెస్తానని బాండ్ పేపర్ రాసి ఇవ్వడమేగాక కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, పార్టీ అగ్ర నేత రాంమాధవ్ తదితర నేతలను ఇక్క డికి రప్పించి మాట ఇచ్చారని అన్నారు. దశాబ్దాల కలగా ఉన్న పసుపు బోర్డు వస్తుందన్న ఆశతో అర్వింద్‌ను ఇక్కడి ప్రజలు పార్లమెంట్‌కు పంపారని, కానీ ఆయన గెలిచి ఐదేళ్లే అయిందని, నరేంద్ర మోడీ పదేళ్లుగా ప్రధానిగా ఉన్నారని అన్నారు. మోడీ ఇప్పుడు వచ్చి అర్వింద్‌ను గెలిపించండి..

పసుపు బోర్డును ఇప్పిస్తానని బుకాయిస్తున్నారని, ఇదే యుపి, గుజరాత్‌లో మాట ఇచ్చి ఉంటే పదేళ్లు వాయిదా వేసేవారా అని ప్రశ్నించారు. తమ ప్రాంతమన్నా.. రైతులన్నా లెక్కలేనితనం వచ్చిందని, ఎన్నిసార్లు అయినా మోసం చేయవచ్చని, నమ్మించి గొంతు కోయవచ్చని మోడీ, అర్వింద్ అనుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఆర్మూర్‌లో ఎంఎల్‌ఎగా గెలిచిన రాకేష్ రెడ్డి ఈ ఐదు నెలల్లో మోడీ నుంచి ఏమి తెచ్చారో చెప్పాలని, రాబోయే రోజుల్లో పసుపు, ఎర్రజొన్న పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వడంతో పాటు వరికి ఐదు వందల బోనస్ ఇచ్చి తీరుతామని ప్రకటించారు. అలాగే ఆగస్టు 15 లోపు రెండు లక్షల రుణమాఫీ చేసి రైతుల రుణం తీర్చుకుంటానని స్పష్టం చేశారు. రుణ మాఫీ చేస్తే రాజీనామా చేస్తానని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీష్ రావు అంటున్నారని, రాజీనామాను జేబుల్లో పెట్టుకోవాలని తాను సవాల్ చేశానన్నారు. మాట ఇస్తే తల తెగి కింద పడ్డా వెనక్కి చూడనని అన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News