Thursday, January 23, 2025

సభలో కెటిఆర్‌కు సిఎం రేవంత్‌రెడ్డి కౌంటర్

- Advertisement -
- Advertisement -

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సభలో గరం గరంగా చర్చ జరుగుతోంది. సభలో మాజీ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కొంతమంది ఎన్నారైలకు ప్రజాస్వామిక స్పూర్తి అర్థంకాదని కెటిఆర్ ఉద్దేశించి సిఎం వ్యాఖ్యనించారు. కెసిఆర్ కు రాజకీయంగా అవకాశం ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ అన్నారు.

యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిండెంట్ గా కెసిఆర్ కు అవకాశమిచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఎంపిగా గెలిపించింది, కేంద్రమంత్రిని చేసిందే కాంగ్రెస్ అన్నారు. హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్,గంగుల కమలాకర్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, దానం నాగేందర్, కడియం శ్రీహరికి గతంలో మంత్రులుగా చేయలేదా? అని సిఎం రేవంత్ ప్రశ్నించారు. పోతిరెడ్డిపాడు గురించి పీజేఆర్ ఒక్కరే పోరాటం చేశారని రేవంత్ అన్నారు. ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్లు ఎవరూ కొట్లాడలేదని స్పష్టం చేశారు. ఐదేళ్ల సమయం ఉంది.. ఏమేమి జరిగిందో.. అన్నీ లెక్కలతో సహా వివరిస్తామన్నారు. 9 ఏళ్ల పాలనపై ఎక్స్ రే తీసినట్లు అన్నీ బయటపెడతామని సిఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News