Friday, December 20, 2024

ఫ్యూచర్ స్టేట్

- Advertisement -
- Advertisement -

ఇకపై తెలంగాణను ‘ఫ్యూచర్ స్టేట్ ట్యాగ్‌లైన్’తో పిలుచుకుందామని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. అమెరికాలో ప్రతి రాష్ట్రాన్ని ప్రత్యేక ట్యాగ్‌లైన్‌తో పిలుస్తారని అలాగే తెలంగాణను ఫ్యూచర్ స్టేట్‌గా పిలుచుకుందామని ఆయన తెలిపారు. హైదరాబాద్ పునర్నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం చేపడుతున్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ హబ్, నెట్ జీరో సిటీ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో తెలంగాణ ‘ది ఫ్యూచర్ స్టేట్’కు పర్యాయపదంగా నిలుస్తుందని ఆయన తెలిపారు. కాలిఫోర్నియాలో ఇండియన్ కాన్సులేట్ జనరల్ నిర్వహించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బిజినెస్ రౌండ్‌టేబుల్ టెక్ యునికార్న్ సీఈఓలను ఉద్దేశించి ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఐటీ యూనికార్న్ ప్రతినిధులందరూ తెలంగాణకు రావాలని ఆయన ఆహ్వానించారు. మీ భవిష్యత్‌ను ఆవిష్కరించుకొండి. అందరం కలిసికట్టుగా సరికొత్త భవిష్యత్‌ను తీర్చిదిద్దుకుందామని ఆయన పిలుపునిచ్చారు. ‘ఇప్పటి వరకు తాము న్యూయార్క్, న్యూజెర్సీ, వాషింగ్టన్ డీసీ, టెక్సాస్‌లో పర్యటించామని, ఇప్పుడు కాలిఫోర్నియాలో ఉన్నామని సిఎం రేవంత్ తెలిపారు.

అమెరికాలో ప్రతి రాష్ట్రానికి ఒక ప్రత్యేక లక్ష్యం ఉంది
అమెరికాలో ప్రతి రాష్ట్రానికి ఒక ప్రత్యేక లక్ష్యం ఉందని, ఆ లక్ష్యాన్ని సూచించే నినాదం ఉందని, అవుటాఫ్ మెనీ వన్ అనేది న్యూయార్క్ స్టేట్ నినాదం, టెక్సాస్‌ను లోన్ స్టార్ స్టేట్ అని పిలుస్తారని ఆయన తెలిపారు. కాలిఫోర్నియాకు యురేకా అనే నినాదం ఉందని, మన దేశంలో రాష్టాలకు ఇటువంటి ప్రత్యేక నినాదాలేమీ లేవని, ఇప్పటినుంచి మన రాష్ట్రానికి అటువంటి ఒక లక్ష్య నినాదాన్ని ట్యాగ్‌లైన్‌గా పెట్టుకుందామన్నారు. ఇకపై మన రాష్ట్రాన్ని తెలంగాణ ఫ్యూచర్ స్టేట్ అని పిలుద్దామని సిఎం ప్రకటించారు. ప్రపంచ టెక్ పరిశ్రమలకు తెలంగాణలో అనుకూలమైన వాతావరణం ఉందని మంత్రి డి.శ్రీధర్‌బాబు అన్నారు. పెట్టబడులకు అనుకూలమైన విధానాలను తమ ప్రభుత్వం అనుసరిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యునికార్న్ కంపెనీల వ్యవస్థాపకులు స్వయంగా హైదరాబాద్‌ను సందర్శించాలని మంత్రి ఆహ్వానించారు. అక్కడ పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, సదుపాయాలను పరిశీలించాలని ఆయన కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News