Tuesday, December 24, 2024

నేడు కరీంనగర్, వరంగల్, చేవెళ్ల నియోజకవర్గాల్లో సిఎం పర్యటన

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థుల తరపున ఆయా నియోజకవర్గాల్లో సిఎం రేవంత్‌రెడ్డి విస్తృత పర్యటనలు చేస్తూ కార్నర్ మీటింగ్, జన జాతర సభలకు హాజరవుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం నాటి సిఎం రేవంత్ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. మంగళవారం ఆయన కరీంనగర్, వరంగల్, చేవెళ్ల లోక్ సభ నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు హుజూరాబాద్ జనజాతర సభకు సిఎం రేవంత్‌రెడ్డి హాజరవ్వనున్నారు. అదే విధంగా సాయంత్రం 4 గంటలకు భూపాలపల్లి జనజాతర సభలో పాల్గొంటారు. రాత్రి 7 గంటలకు బాలాపూర్, బడంగ్ పేట్ కార్నర్ మీటింగ్, రాత్రి 9 గంటలకు ఆర్కేపురం, సరూర్ నగర్ కార్నర్ మీటింగ్‌లకు సిఎం రేవంత్ రెడ్డి హాజరవ్వనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News