Wednesday, January 22, 2025

హామీలన్నీ అమలు

- Advertisement -
- Advertisement -

ప్రభుత్వం ఏర్పడిన 10నెలల్లోనే
50వేల ఉద్యోగాలు ఇచ్చాం
ఇచ్చిన మాట ప్రకారం 25రోజుల్లో
22లక్షల మంది రైతులకు
రూ.18వేల కోట్ల రుణమాఫీ చేశాం
అర్హులైన లబ్ధిదారులకు రూ.500లకే
గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం
50లక్షల మందికి 200 యూనిట్ల
వరకు ఉచిత విద్యుత్ సరఫరా
వరికి రూ.500 బోనస్ అదనంగా
ఇస్తున్నాం మహిళల ఉచిత బస్సు
ప్రయాణం కింద ఆర్‌టిసికి
రూ.3,541కోట్లు చెల్లించాం
ఎవరికైనా వివరాలు కావాలంటే
అందించడానికి సిద్ధంగా ఉన్నాం
ముంబైలో జరిగిన మీడియా
సమావేశంలో సిఎం రేవంత్‌రెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్ :మహారాష్ట్ర బిజెపి నేతలు కొద్దిరోజులుగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై అబద్ధపు ప్రచారం చేస్తున్నారని సిఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వం ఏర్పడిన ప ది నెలల్లోనే తెలంగాణలో 50 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పే ర్కొన్నారు. మోడీ కూడా తెలంగాణలో కాంగ్రెస్ గ్యారంటీల అమలుపై అబద్దాలు చెప్పడం మొదలుపెట్టారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ అబద్ధాలు చెప్పడం మానుకోకపోతే మేం ని జాలు చెబుతూనే ఉంటామన్నారు. తెలంగాణ ప్ర జలకు సోనియాగాంధీ సెప్టెంబర్ 17, 2023 లో అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆరు గ్యారంటీల కు సంబంధించిన హామీ ఇచ్చిందని సిఎం రేవంత్ గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రం సోనియా గాంధీ ఇచ్చిన గ్యారంటీ వల్ల సిద్దించిందన్నా రు. ఈ విషయాలను మహారాష్ట్ర ప్రజల ముందు పెట్టడం తన బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. అందుకే తాను మహారాష్ట్ర ప్రజలకు తెలంగాణలో ఆరు గ్యారంటీల అమలుపై నిజాలు చెప్పడానికి ఇక్కడ కు వచ్చామన్నారు. మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నిక లు దగ్గరపడుతున్న నేపథ్యంలో సిఎం రేవంత్ రెడ్డి అక్కడ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ముంబై వెళ్లారు.

ఈ సందర్భంగా ముంబైలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సిఎంల మీటింగ్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్ మాట్లాడుతూ దేశంలోనే మహారాష్ట్రలోనే ఎక్కువగా రైతు ఆత్మహత్యలు జరిగాయన్నారు. రైతుల సంక్షేమం కోసం ఎలాంటి పనులు కేంద్రం చేపట్టలేదని సిఎం రేవంత్ విమర్శించారు. రైతులకు ఎంఎస్‌పి ఇవ్వలేదని, రైతుల కోసం మోడీ నల్లచట్టాలను తీసుకొచ్చే ప్రయత్నం చేశారని సిఎం రేవంత్ మండిపడ్డారు. నల్లచట్టాలు తెచ్చి అదానీ, అంబానీలకు మేలు చేయాలని మోడీ భావించారని సిఎం ఆరోపించారు. తెలంగాణలో రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చామని, ఇచ్చిన మాట ప్రకారం 25 రోజుల్లో 22,22,067 మంది రైతులకు రూ.17,869 కోట్లు మాఫీ చేశామన్నారు. ఎవరికైనా వివరాలు కావాలంటే ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని సిఎం రేవంత్ తెలిపారు. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్లలో నిరుద్యోగులను మోసం చేసిందని సిఎం రేవంత్ విమర్శించారు. బిజెపి నేతలు ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్‌లో ఎవరు తెలంగాణకు వచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి వివరాలు అందచేస్తామని సిఎం రేవంత్ పేర్కొన్నారు.

ఇప్పటివరకు ఆర్టీసికి రూ.3,541 కోట్లు చెల్లించాం
తెలంగాణ రైతుల విషయంలో మోడీ విమర్శలకు సరైన సమాధానం ఇచ్చామని తెలిపారు. ఆ తరువాత ఆయన తన ట్వీట్‌ను డిలీట్ చేసుకున్నారని సిఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. రూ.500లకే గ్యాస్ అందిస్తున్నామని సిఎం రేవంత్ తెలిపారు. ఇప్పటివరకు దాదాపు 50 లక్షల మందికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ద్వారా లబ్ధిపొందుతున్నారని ఆయన పేర్కొన్నారు. వరికి రూ.500 మద్దతు ధర అందిస్తున్నామని సిఎం తెలిపారు. రూ. 1కోటి 4 లక్షల మంది మహిళలు ఈ పది నెలల్లో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం వినియోగించుకున్నారని ఆయన తెలిపారు. ఇందుకోసం రూ.3,541 కోట్లు ఆర్టీసికి ప్రభుత్వం అందించిందని ఆయన తెలిపారు.

మహారాష్ట్రకు రావాల్సిన 17 మెగా ప్రాజెక్టులు గుజరాత్‌కు….
సామాజిక న్యాయం అందించేందుకు తెలంగాణలో కులగణన చేపట్టామని సిఎం రేవంత్ తెలిపారు. 2025 జనగణలో తెలంగాణ కులగణనను పరిగణనలోకి తీసుకోవాలని కేబినెట్ లో తీర్మానం చేశామని ఇదే విధానాన్ని మోడీ అమలు చేయాలని ఆయన సూచించారు. దేశచరిత్రలో మహారాష్ట్రకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. దేశ గతిని మార్చిన ఎందరో మహానుభావులకు మహారాష్ట్ర గడ్డ జన్మనిచ్చిందని తెలిపారు. మహారాష్ట్ర అంటే శివాజీ మహారాజ్ గుర్తకు వస్తారని సిఎం పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో మహా వికాస్ అఘాడీ కూటమిని గెలిపించాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

మహాత్మా జ్యోతిబాపూలే, బాలగాంగధర్ తిలక్, సావిత్రిబాయి పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వంటి ఎందరో మహానుభావులు ప్రజల్లో చైతన్యం నింపి దేశానికి ఒక దారి చూపారని సిఎం రేవంత్ తెలిపారు. ఇంతటి ఘనత ఉన్న మహారాష్ట్ర ఎవరి చేతుల్లోకి వెళ్లకూడదన్నారు. మహారాష్ట్రకు రావాల్సిన 17 మెగా ప్రాజెక్టులు మోడీ గుజరాత్ కు తరిలించుకుపోయారని సిఎం రేవంత్ విమర్శించారు. మహారాష్ట్ర ప్రజలను మోసం చేసిన బిజెపిని ఈ ఎన్నికల్లో ఓడించాలని సిఎం రేవంత్ పిలుపునిచ్చారు. విభజన రాజకీయాలతో ప్రజల మధ్య బిజెపి చిచ్చు పెడుతోందని సిఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మహారాష్ట్ర ఎన్నికల స్టార్ క్యాంపెయినర్‌గా రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దీనికోసం ఆయన శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి విమానంలో శనివారం ఉదయం ముంబైకు చేరకున్నారు. ముంబయిలోని మహారాష్ట్ర పిసిసి కార్యాలయంలో హిమాచల్ ప్రదేశ్ సిఎం సుఖ్విందర్ సుక్కు, ఏఐసిసి జాతీయ మీడియా కమిటీ చైర్మన్ పవన్ ఖేరాలతో సిఎం రేవంత్ తాజాగా సమావేశం అయ్యారు. ప్రస్తుతం మహారాష్ట్ర ఎన్నికల స్టార్ క్యాంపెయినర్‌గా సిఎం రేవంత్ రెడ్డి ఉన్న విషయం తెలిసిందే. మహారాష్ట్రలో నవంబర్ 20న జరగనున్న ఎన్నికల నేపథ్యంలో అక్కడ కాంగ్రెస్ సిఎంల సమావేశంలో రేవంత్ పాల్గొన్నారు. ఎన్నికల మేనిఫెస్టో, పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై సిఎం రేవంత్ చర్చించారు. ఈ సమావేశం అనంతరం పలు నియోజకవర్గాల్లో రేవంత్ ప్రచారం నిర్వహించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News