Thursday, December 26, 2024

ప్రజలకు సేవ చేయడానికే వచ్చారు: రేవంత్ సోదరి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జీవితంలో ఒక్కో మెట్టు ఎక్కుతూ తన రాజకీయ ప్రస్థానం కొనసాగిస్తూ ముఖ్యమంత్రి ఎదిగారని ఆయన సోదరి సుమతి ప్రశంసించారు. ముఖ్యమంత్రిగా రేవంత్ ప్రమాణ స్వీకారానికి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో ముచ్చటించారు. రేవంత్ అనుకుంటే సాధిస్తారని, రాజకీయాల్లోకి అడుగుపెట్టాక ఉన్నత స్థానానికి వెళ్తారని ముందుగానే గ్రహించామని తెలిపారు. ప్రజలకు సేవ చేయాలనే లక్షంతోనే రేవంత్ రాజకీయాల్లోకి వచ్చారని పేర్కొన్నారు. కొడంగల్ ఎంఎల్‌ఎగా ఉన్నప్పుడు తన వద్దకు ప్రజల కష్టసుఖాలను తెలుసుకోవడంతో తమతో చర్చించేవాడని గుర్తు చేశారు. మల్కాజిగిరి ఎంపిగా, టిపిసిసి అధ్యక్షుడిగా తీరికలేకున్నా తమతో మాట్లాడేవారని, శుభకార్యాలకు వచ్చేవాడని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం రేవంత్ మంచిగా పని చేయాలని ఆమె ఆకాంక్షించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News