- Advertisement -
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించిన నేపథ్యంలో శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. “ఆర్థిక సంస్కరణలు తెచ్చి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన గొప్ప వ్యక్తి పీవీ, పీవీ నరసింహారావుకి భారత రత్న ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నాం. ఆలస్యమైనా వారికి ఈ గౌరవం దక్కడం గర్వకారణం. నా తరపున, సభ తరపున, తెలంగాణ ప్రజల తరపున వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు. ఇది మనందరికీ గర్వకారణం” అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
- Advertisement -