Friday, December 20, 2024

అభివృద్ధికి అభయహస్తం

- Advertisement -
- Advertisement -

ఏడుపాయ ల వనదుర్గామాత పాదాల సాక్షిగా ఆగస్టు 15 వ తేదీలోగా రెండు లక్షల రైతు రుణమాఫీ చే యబోతున్నామని సిఎం రేవంత్‌రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. మెదక్ పార్లమెం ట్ కాంగ్రెస్ అ భ్యర్థి నీలం మధు శనివారం నామినేషన్ దాఖ లు చేసేందుకు మంత్రులు కొండా సురేఖ, పొం గులేటి శ్రీనివాస్‌రెడ్డి, దామోదర్ రాజనర్సింహ తో పాటు స్థానిక ఎంఎల్‌ఎ మైనంపల్లి రోహిత్‌రావుతో కలిసి విచ్చేసిన ముఖ్యమంత్రి ఇక్కడి రాందాస్ చౌరస్తాలో కార్నర్ మీటింగ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ… వచ్చే ఖరీఫ్ పంట కొనుగోలుపై 500 రూపాయల బోనస్ అందజేయనున్నట్లు మెతుకుసీమ నుంచి రైతులకు హామీ ఇచ్చారు. ఇందిరాగాంధీ హయాంలో మెతుకుసీమకు బిహెచ్‌ఈఎల్, బిడిఎల్, ఇక్రిశాట్‌లతోపాటు ఎన్నో పరిశ్రమలు ఈ ప్రాంతానికి వచ్చాయని, తద్వారా లక్షల మందికి ఉపాధి కలిగిందని అన్నారు.

గ డిచిన 25 సంవత్సరాల నుంచి బిజెపి, బిఆర్‌ఎస్ ఎంపిలు మెదక్ ఎంపిలుగా గెలిచినప్పటికీ ఈ ప్రాంతానికి ఏ ఒక్క పరిశ్రమను కూడా తీసుకురాలేకపోయిన అసమర్థులని అభివర్ణించారు. మళ్లీ ఎన్నికల వేళ ఈ రెండు పార్టీ అభ్యర్థులు సిగ్గు లేకుండా ఓట్లకోసం బయలుదేరారని వి మర్శించారు. కాంగ్రెస్ కష్టాల్లో ఉన్నప్పుడు ఇం దిరాగాంధీని గెలిపించి ప్రధానమంత్రిని చేసిన చరిత్ర మెతుకుసీమదని అన్నారు. మళ్ల్లీ కేంద్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే దేశం ఎంతో అభివృద్ధికి నోచుకుంటుందని అన్నారు. గతంలో దుబ్బాకలో గెలిచిన రఘునందన్‌రావు కేంద్రం నుంచి ఎన్ని నిధులు తెచ్చారో చూపించాలని ప్ర శ్నించారు. గడిచిన పదేళ్లల్లో కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కెసిఆర్, స్థానిక ఎంఎల్‌ఎ హరీష్‌రా వు అధికారంలో ఉండి ఈ ప్రాంతానికి తెచ్చిన నిధులు, ఉద్యోగాలు
ఎన్ని అంటూ ప్రశ్నించారు. దేశం కోసం ప్రాణాలర్పించిన ఘనత ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీదేనని కొనియాడుతూ వారి హయాంలోనే వేల పరిశ్రమలు, లక్షల ఉద్యోగావకాశాలు వచ్చాయని తెలిపారు.

దేశ నలుమూలల నుంచి ఇక్కడికి ఉపాధి కోసం వచ్చిన కూలీలను అక్కున చేర్చుకునే తత్వం మెతుకుసీమ ప్రాంత వాసులదని కొనియాడారు. ఇక మొన్నటివరకు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కెసిఆర్ పని అయిపోయి కారు షెడ్డుకు.. దొర ఫాంహౌస్‌కు పరిమితమయ్యారన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు గద్దెదించినప్పటికీ కెసిఆర్‌కు అహం తగ్గక కాంగ్రెస్ పని అయిపోయిందంటూ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ‘అయిపోవడానికి ఇదేమైనా నీ ముందు ఉన్న ఫుల్ బాటిలా’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘కాంగ్రెస్‌కు కాపలాగా ఉన్నది రేవంత్‌రెడ్డి అని గుర్తు పెట్టుకో ..మా జోలికి వస్తే బట్టలు ఊడదీసి పరిగెత్తించుకుంటూ తరిమికొడతాం జాగ్రత్త’ అని మాస్ వార్నింగ్ ఇచ్చారు. ‘మమల్ని టచ్ చేస్తే మసైపోతారు.. హరీష్‌లాంటి వ్యక్తులు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు.. మాజోలికొస్తే పండబెట్టి తొక్కుతాం..నీలాంటి వ్యక్తులను తొక్కుకుంటూ ఈ స్థాయికి చేరుకున్నా’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ఏర్పడ్డ నాలుగు నెలల్లోనే ఆరోగ్యశ్రీ ద్వారా ప్రతి పేదవారికి పది లక్షల ఉచిత వైద్యాన్ని

అందజేయడమే కాకుండా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200లోపు యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత ఆర్‌టిసి ప్రయాణం కల్పిస్తున్నామన్నారు. వైఎస్ హయాంలో 25 లక్షల మందికి ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌దేనని.. సోయిలేని సన్నాసి దద్దమ్మ కెసిఆర్ ఎంతమందికి డబుల్ బెడ్‌రూంలు ఇచ్చారంటూ ప్రశ్నించారు. ప్రతి నియోజకవర్గానికి 3500 ఇళ్ల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల 50 వేల ఇళ్లను అందజేసి పేదోడి సొంతింటి కలను తమ ప్రభుత్వ హయాంలో నెరవేర్చబోతున్నామని అన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే ఐదు హామీలు నెరవేర్చామని అన్నారు. గత ప్రభుత్వం ఇంటికో ఉద్యోగం, దళితబంధు, బిసి బంధు, దళితులకు మూడెకరాల భూమి, ఇళ్లు లేని వారికి డబుల్ బెడ్‌రూంలు ఇస్తామంటూ మోసం చేసిన ఘనత కెసిఆర్, హరీష్‌రావుదని అన్నారు. మల్లన్నసాగర్‌లో 14 గ్రామాలకు చెందిన 50 వేల ఎకరాల పేదోళ్ల భూములు లాక్కొని మహిళలను పోలీస్ స్టేషన్‌లకు లాక్కెళ్లి చిత్రహింసాలు పెట్టిన వెంకట్రామిరెడ్డికి బిఆర్‌ఎస్ ఎంపి టికెట్ ఇచ్చి ఓట్లు అడుక్కోవడానికి సిగ్గుందా అంటూ కెసిఆర్‌ను విమర్శించారు.

నిజాంకు ఖాసీం రజ్వి గులాంగిరీ చేసినట్లు కెసిఆర్‌కు బిఆర్‌ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి గులాంగిరీ చేస్తున్నారని అన్నారు. వెంకట్రామిరెడ్డి లాంటి దుర్మార్గుడికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటు వేసి మోసపోవద్దని ప్రజలకు సూచించారు. కేంద్రంలో పదేళ్ల అధికారంలో ఉండి నల్లధనాన్ని బయటకు తీసుకువచ్చి ప్రతి పేద కుటుంబానికి పదిహేను వేల చొప్పున ఇస్తానని చెప్పి ఇవ్వలేకపోయిన చరిత్ర మోడీదన్నారు. ఢిల్లీలో మోడీకి గల్లీలో కెడి కెసిఆర్‌కు ఓటు వేసి ప్రజలు మరోసారి మోసపోవద్దని సూచించారు. బడుగు, బలహీనవర్గాలకు చెందిన తమ పార్టీ అభ్యర్థి నీలం మధుకు ప్రజలు ఓటేసి గెలిపించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంఎల్‌ఎ మదన్‌రెడ్డి, డిసిసి అధ్యక్షుడు అంజనేయులుగౌడ్, మాజీ ఎంఎల్‌ఎలు మైనంపల్లి హనుమంతరావు, జగ్గారెడ్డి, పార్టీ నాయకులు చెరుకు శ్రీనివాస్‌రెడ్డి, కాటా శ్రీనివాస్, ఆవుల రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News