Monday, December 23, 2024

రాజ్యాంగం మార్చే కుట్ర.. అప్పుడే మొదలైంది: సిఎం రేవంత్

- Advertisement -
- Advertisement -

రాజ్యాంగాన్ని మార్చడం కోసమే బీజేపీ 400 సీట్లు అంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాజ్యాంగాన్ని మార్చడమనేది 2000 సంవత్సరంలోనే మొదలైందని.. 2004లో బీజేపీ ప్రభుత్వం వచ్చుంటే.. అప్పుడే మారుస్తుండే అని చెప్పారు. రాజ్యాంగాన్ని మార్చడం కోసమే 8 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చారని విమర్శించారు. బుధవారం గాంధీ భవన్ లో మీడియాతో సీఎం రేవంత్ మాట్లాడుతూ.. మోడీ మళ్ళీ గెలిస్తే.. దేశ ప్రజాస్వామిక మనుగడ ప్రమాదంలో పడే అవకావం ఉందన్నారు.

దేశంలో మతపరమైన రిజర్వేషన్ లేదని.. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని రేవంత్ చెప్పారు. బీజేపీ నాయకులు చెప్పేదానికి. చేసేదానికి పోలీక ఉండదన్నారు. ఎంపీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసే క్యాండేట్లను బయపెట్టి విత్ డ్రా చేపిస్తున్నారని ఆయన ఫైరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News