Monday, December 23, 2024

అడ్డగోలు రుణాలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ ఆర్ధిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసే అంశంపై జరిగిన చర్చ సందర్భంగా అసెంబ్లీ దద్ధరిల్లింది. ఈ నే పథ్యంలో విపక్షాలకు సిఎం రేవంత్ రెడ్డి గట్టి కౌంటరిచ్చారు. బిఆర్‌ఎస్ ప్రభు త్వం తప్పుడు నివేదికలిచ్చి అడ్డగోలుగా రుణాలు తీసుకుందని రేవంత్ తీవ్ర ఆరోపణ చేశారు. మిషన్ భగీరథ ద్వారా ఇం టింటికీ నల్లాల ద్వారా నీళ్లు ఇస్తున్నామ ని చెప్పిన ప్రభుత్వం 2014కు ముందు గ్రామాల్లో నీళ్లు తాగలేదన్నట్లు చెబుతోందని సిఎం రేవంత్ ఆరోపించారు. శివుడి తలమీద గంగను భూమి మీదకు తెచ్చి కాళేశ్వరం ద్వారా పంపిణీ చేసి అద్భు తం చేసి జీవితాలను ధన్యం చేసినట్లు, రోల్ మోడల్ రాష్ట్రం అని గొప్పగా చెప్పుకుంటుందని సిఎం ఎద్దేవా చేశారు. సభ ను మిస్ లీడ్ చేసేలా హరీశ్‌రావు వ్యవహారిస్తున్నారన్నారు. భగీరథ ద్వారా 2019-20 సంవత్సరంలో గ్రామ పంచాయతీల నుంచి రూ. 1,030 కోట్లు, మున్సిప ల్ కార్పొరేషన్ల ద్వారా రూ. 159 కోట్లు, మున్సిపాలిటీల నుంచి రూ. 369 కోట్లు,

పరిశ్రమల
నుంచి రూ. 4,145 కోట్లు మొత్తం రూ. 5,706 కోట్లు ప్రతి సంవత్సరం ఈ ప్రాజెక్టు ద్వారా ఆదాయం వస్తుందని చెప్పి అప్పులు తీసుకునేటప్పుడు బ్యాంకులను మభ్యపెట్టి తప్పుడు నివేదికలు ఇచ్చి రుణం తీసుకుందని సిఎం ఆరోపించారు. శ్వేతపత్రంపై అక్బరుద్దీన్ ఒవైసీ అనుమానం వ్యక్తం చేశారని తాము వాస్తవ పరిస్ధితులను ప్రజల ముందు వుంచే ప్రయత్నం చేశామని చెప్పారు. శ్వేతపత్రం విడుదలపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శ్వేతపత్రం ఎవరినో కించపరచడానికి కాదని, తాము ఎవరినీ నిందించే ప్రయత్నం చేయలేదన్నారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వం ఆలోచించడం లేదని స్పష్టం చేశారు. ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ పదేళ్లు తెలంగాణ కోసం పని చేసిన అధికారులను అవ మానించేలా హరీశ్ రావు మాట్లాడారని విమర్శించారు. కాంగ్రెస్ సృష్టించిన సంపదను తనఖా పెట్టి బిఆర్‌ఎస్ ప్రభుత్వం అప్పులు తెచ్చిందని, కాంగ్రెస్ కూడబెట్టిన రూ.4,972 కోట్ల విద్యుత్ శాఖ ఆస్తులను బిఆర్‌ఎస్ తనఖా పెట్టిందని సిఎం రేవంత్‌రెడ్డి దుయ్యబట్టారు. గత ప్రభుత్వం పదేళ్లలో రూ.13 లక్షల 72వేల కోట్లు ఖర్చు చేసిందని, ఇంత ఖర్చు చేసినా ప్రజలకు చేసిందేం లేదన్నారు. ఇంకా అబద్దాలతో సభను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నా రన్నారు. కాళేశ్వరం పేరుతో లక్ష కోట్లు దుర్వినియోగం చేశారని విమర్శించారు.

అబద్దాలతో వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేశారని, ఇప్పుడేమో సత్యహరిశ్చంద్రుల్లా మాట్లాడుతున్నారన్నారు. పేదలకు డబుల్ బెడ్రూంలు ఇవ్వలేదు, దళితులకు మూడెకరాలు ఇవ్వలేదు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఇవ్వలేదు, రాజీవ్ ఆరోగ్యశ్రీ నిధులు విడుదల చేయని పరిస్థితి, మధ్యాహ్న భోజన కార్మికులకు జీతాలు ఇవ్వ లేదు, సెక్రటేరియట్ లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వని పరిస్థితి, ప్రతీ నెలా మొదటి తారీఖున రావాల్సిన ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వని పరిస్థితి, పెద్దకొడుకును అని చెప్పుకున్న పెద్దమనిషి ఆసరా పెన్షన్లు ఇవ్వని పరిస్థితికి తీసుకొచ్చారన్నారు. నాలుగు నెలల ముందే వైన్స్ టెండర్లు వేసి ఉన్నదంతా దోచుకున్నారని విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ఆర్ధిక విధ్వంసం సృష్టించారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని బిఆర్‌ఎష్ నెరవేర్చలేదన్నారు. లక్ష ఎకరాలకు నీళ్లు ఇస్తామన్నారు, ప్రతీ నియోజకవర్గంలో వంద పడకల ఆసుపత్రి కడతామన్నారన్నారు. నిజాలు చెబితే పరువు పోతుందంటున్నారు, కానీ ఊరుకుంటే ప్రజల ప్రాణాలు పోయే పరిస్థితి, అందుకే వాస్తవాలను ప్రజలకు వివరిస్తున్నామని సిఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వం సరైన ఉద్ధేశ్యంతో నిధులను ఖర్చు చేసిందా? లేదా? అనేది కాగ్ చెబుతుం దన్నారు. అయితే ఈ శ్వేతపత్రం మేమిచ్చిన హామీలను ఎగవేసేందుకు కాదని స్పష్టం చేశారు.

బిఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చిన ప్రారంభంలో ఆర్‌బిఐ వద్ద 303 రోజుల మిగులు నిధులు ఉండేవని, ఈ పదేళ్లలో ఏకంగా ముప్పై రోజులకు పడిపోయిందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు కూడా రుణాలు పుట్టని పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆదాయం, అవసరాలకు సంబంధించి ఆర్‌బిఐ సమాచారం ఇస్తుందని తెలిపారు. ఆర్‌బిఐ, కాగ్ సమాచారం తీసుకున్నామన్నారు. తెలంగాణను బలమైన రాష్ట్రంగా నిలవడమే తమ లక్ష్యమన్నారు. సిద్ధాంత విభేదాలు ఉన్నప్పటికీ ప్రధాని నరేంద్రమోదీని కలిసేందుకు తాను కిషన్ రెడ్డిని అడిగానని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. మేం ఏం చేయాలనుకున్నా దానిని సభ ముందు పెడతామని హామీ ఇచ్చారు. తెలంగాణను ప్రపంచంతో పోటీ పడేలా చేయాలన్నదే తమ లక్ష్యమ న్నారు.
విద్యుత్, సాగునీటి రంగాలపై శ్వేత పత్రాలు విడుదల చేస్తాం-
గత పాలకులు వాస్తవాలు దాచి గొప్పులు చెప్పుకున్నారని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. చివరికి ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి తెచ్చారన్నారు. వాస్తవాలు కఠోరంగా ఉన్నప్పుడు వాటిని అంగీకరించాలన్నారు. ఈ వాస్తవాలు కొందరికి చేదుగా ఉండొచ్చన్నారు. విద్యుత్, సాగు నీటి రంగాలపై శ్వేత పత్రాలు విడుదల చేస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News