Tuesday, January 21, 2025

న్యాయ విచారణపై బిఆర్ఎస్ ది ద్వంద్వ వైఖరి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : బిఆర్‌ఎస్ పాలనలో విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణంలో భారీగా అ వినీతి జరిగిందని సిఎం రేవంత్‌రెడ్డి ఆరోపించా రు.విద్యుత్ అంశంపై న్యాయవిచారణ కోరింది బిఆర్‌ఎస్ సభ్యులేనని, నిజానిజాలు బయటకు వస్తాయని వద్దంటున్నది వాళ్లేనని ఆయన వ్యా ఖ్యానించారు.వాళ్ల పార్టీవారికి ఇచ్చిన పనుల్లో వేల కోట్ల అవినీతి జరిగిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభ సమావేశాల్లో సోమవారం విద్యుత్ అంశంపై వాడివేడీ చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా సిఎం రేవంత్‌రెడ్డి ఛత్తీస్‌ఘఢ్ విద్యుత్ కోనుగోలు, యాదాద్రి పవర్‌ప్లాంట్ కు సంబంధించిన న్యా యవిచారణ అంశంపై ఆ యన మాట్లాడుతూ మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి చర్లపల్లి జైల్లో ఉ న్నట్లు మాట్లాడుతున్నారని, కెసిఆర్ సత్యహరిశ్చంద్రుడికి ప్రతిరూపంలో ఉన్నట్లు చెబుతున్నారని సిఎం రేవంత్ ఎద్దేవా చేశారు. విచారణ కమిషన్ ముందు వాదనలు వినిపిస్తే బీఆర్‌ఎస్ సభ్యుల నిజాయతీ బయటకు వచ్చేదని ఆయన వ్యాఖ్యానించారు.బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కోర్టుల నిర్ణయాలను తప్పుదోవ పట్టించేలా మా ట్లాడుతున్నారని సిఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. ఇలా మాట్లాడితే ప్రాసిక్యూట్ చేయాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. కమిషన్ రద్దు చే యాలన్న హైకోర్టుకు వెళ్లారని ఆయన తెలిపారు.

విచారణ కమిషన్ రద్దు చేయమని, విచారణ ఎ దుర్కోవాల్సిందేనని హైకోర్టు చెప్పిందని ఆయన వెల్లడించారు. కమిషన్ రద్దు చేయడం కుదరదని సుప్రీంకోర్టుకు కూడా చెప్పిందని, చైర్మన్ ప్రెస్‌మీట్ నిర్వహించారన్న అభ్యంతరంపై కోర్టు మ మ్మల్ని అడిగిందని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. చైర్మన్ మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉందా అని సుప్రీంకోర్టు ప్రశ్నించిందని, దానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని సు ప్రీంకోర్టుకు చెప్పామని ఆయన వెల్లడించారు. క మిషన్ రద్దు చేయాలన్న వాళ్ల విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించిందని, కెసిఆర్ వాదనను సుప్రీంకోర్టు తి రస్కరించిందని పేర్కొన్నారు. భద్రాద్రి పవర్‌ప్లాంట్‌ను రెండేళ్లలో పూర్తి చేస్తామని ఒప్పందం చేసుకున్నారని, రెండేళ్లలో పూర్తి చేస్తామన్నా ప్రాజెక్టుకు ఏడేళ్లు పట్టిందని సిఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు.విద్యుత్ కమిషన్ ఎదుట కెసిఆర్ ఎం దుకు హాజరుకావడం లేదని సిఎం ప్రశ్నించారు.

విద్యుత్ కొనుగోళ్లపై
విచారణ కొనసాగించాలని సుప్రీం కోర్టు కూడా చెప్పిందని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. విచారణ కమిషన్‌కు కొత్త చైర్మన్‌ను సాయంత్రం వరకు నియమిస్తామని, బిఆర్‌ఎస్ వాదనలు అక్కడ చెప్పాలని సిఎం రేవంత్ స్పష్టం చేశారు. జైలుకు వెళ్లాల్సి వస్తుందన్న ఉద్ధేశ్యంతోనే కమిషన్‌కు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లారని, విద్యుత్ అంశంలో విచారణ వద్దని కోర్టును అడిగారని సిఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
కమీషన్లకు ఆశపడే…
బిఆర్‌ఎస్ పాలనలో కాలం చెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీతో భద్రాద్రి పవర్ ప్లాంట్ నిర్మించారని సిఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. అప్పటికే ఆ టెక్నాలజీని నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకువచ్చిందని ఆయన గుర్తుచేశారు. అప్పటి బిఆర్‌ఎస్ నేతలు కమీషన్లకు ఆశపడి ఇండియా బుల్స్ అనే గుజరాత్ కంపెనీతో కూడబలుక్కొని, బిహెచ్‌ఈఏల్ నుంచి నామినేషన్ బేసిస్ మీద సబ్ క్రిటికల్ టెక్నాలజీ మెషీన్లు కొనుగోలు చేశారని ఆయన పేర్కొన్నారు.

సోనియాగాంధీ దయ, జైపాల్‌రెడ్డి కృషి వల్లే….
విద్యుత్ వినియోగం ప్రాతిపదికనే విద్యుత్ విభజన జరిగేలా జైపాల్‌రెడ్డి చేశారని సిఎం రేవంత్ పేర్కొన్నారు. విభజన చట్టంలో తెలంగాణకు 36 శాతం, ఎపికి 64 శాతం విద్యుత్ వచ్చేలా ఉందన్నారు. జైపాల్‌రెడ్డి కృషి వల్ల వినియోగం ఆధారంగా తెలంగాణకు 54 శాతం వచ్చేలా విద్యుత్ విభజన జరిగిందని సిఎం రేవంత్ గుర్తుచేశారు. ఉత్పత్తి సామర్థ్యం ప్రకారం 36 శాతం తెలంగాణలో, 64 శాతం ఎపిలో ఉందని ఆయన తెలిపారు. తెలంగాణను చీకట్ల నుంచి కాపాడింది జైపాల్‌రెడ్డి అని ఆయన పేర్కొన్నారు. సోనియా గాంధీ దయ, జైపాల్‌రెడ్డి కృషి వల్ల రాష్ట్రం విద్యుత్ సమస్య నుంచి గట్టెక్కిందని సిఎం రేవంత్ కొనియాడారు.
వాళ్ల అబద్ధాలు మానకపోతే, నేను నిజాలు చెప్పడం మానను
యాదాద్రి పవర్ ప్రాజెక్టు 2021లోపు పూర్తి చేస్తామని ఒప్పంద చేసుకున్నారని, ఇప్పటికి పూర్తి కాలేదని సిఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. యాదాద్రి పవర్ ప్లాంట్ పూర్తికి మరో రెండేళ్లు పడుతుందని ఆయన వ్యాఖ్యానించారు. యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్రాజెక్టుల్లో దిగమింగింది తేల్చడానికే విచారణ కమిషన్ వేశామని ఆయన వెల్లడించారు. మంత్రి పదవులు ఇస్తే చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డికి ఊడిగం చేసింది మీరు కాదా అని ఆయన ప్రశ్నించారు. తెలుగుదేశంలో ఉండి కూడా తెలంగాణకు జరిగిన అన్యాయం గురించి సభలో మాట్లాడానని సిఎం రేవంత్‌రెడ్డి గుర్తుచేసుకున్నారు. తనను జైలుకు పంపించినా భయపడలేదని నిలబడి కొట్లాడానని ఆయన పేర్కొన్నారు. వాళ్ల అబద్దాలు మానకపోతే, తాను నిజాలు చెప్పడం మాననని ఆయన హెచ్చరించారు.

బిఆర్‌ఎస్ డిఎన్‌ఏనే తిన్నింటివాసాలు లెక్కపెట్టడం….సిఎం
బిఆర్‌ఎస్ పార్టీ డిఎన్‌ఏలోనే నమ్మిన వారిని మోసం చేసే లక్షణం ఉందన్నారు. పదేళ్లు ఎవరితో కలిసి పనిచేసిన సహచరులను అగౌరపరిచారని ఎక్కడైనా ఉందా అని సిఎం రేవంత్ ప్రశ్నించారు. గురువుకు పంగనామాలు పెట్టడం ఎక్కడైనా ఉందా ? నేను మిత్రులను మిత్రులులాగే చూస్తానని, సహచరులను సహచరులాగే చూస్తానని, పెద్దలను గౌరవిస్తానని సిఎం రేవంత్ పేర్కొన్నారు. తిన్నింటివాసాలు లెక్కపెట్టే లక్షణం బిఆర్‌ఎస్ నేతలకు ఉందని ఆయన విమర్శించారు. బిఆర్‌ఎస్ డిఎన్‌ఏనే తిన్నింటివాసాలు లెక్కపెట్టడమని ఆయన ఎద్దేవా చేశారు. నమ్మిన వారిని మోసం చేసే లక్షణం బిఆర్‌ఎస్‌దేనని ఆయన పేర్కొన్నారు. 24 గంటల విద్యుత్ ఇవ్వాలని చంద్రబాబు హయాంలోనే నిర్ణయం తీసుకున్నారని ఆయన గుర్తు చేశారు. విద్యుత్ కోతలు ఉండకూడదని రాజశేఖర్ రెడ్డి నిర్ణయించారని, యూపిఏ ప్రభుత్వ నిర్ణయాల వల్లే హైదరాబాద్‌కు ఆదాయం పెరిగిందని సిఎం తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News