Monday, March 17, 2025

రెండోసారి నేనే సిఎం

- Advertisement -
- Advertisement -

స్టేచర్ కాదు..నాకు స్టేట్ ఫ్యూచర్ ముఖ్యం

 మొదటిసారి బిఆర్‌ఎస్‌పై వ్యతిరేకతతో ఓటేశారు
రెండోసారి మా అభివృద్ధిని చూసి జనం ఓట్లేస్తారు
ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటాం డీలిమిటేషన్‌లో
దక్షిణాది నష్టపోకుండా ప్రయత్నాలు చేస్తున్నాం
మీడియాతో సిఎం రేవంత్‌రెడ్డి చిట్‌చాట్

మనతెలంగాణ/హైదరాబాద్:రాష్ట్రంలో పదేళ్ల పా టు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుంద ని, రెండోసారి కూడా తానే ముఖ్యమంత్రిని అవుతానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. స్టేచర్ కాదు, స్టేట్ ఫ్యూచర్ తనకు ముఖ్యమని ఆయన వెల్లడించారు. శనివారం ఆయన మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్ మాట్లాడుతూ ఈసారి బిఆర్‌ఎస్ మీదున్న వ్యతిరేకతతో కాంగ్రెస్‌కు ఓట్లేసి గెలిపించారన్నా రు. రెండోసారి మా మీదున్న ప్రేమతో, తాము చే సిన అభివృద్ధిని చూసి ప్రజలు ఓట్లు వేస్తారని ఆ యన ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో భాగంగా ఇ చ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటామని ఆయన మరోసారి స్పష్టం చేశారు. సంక్షేమ పథకాల లబ్ధిదారులే తమ ఓటర్లు అని, 25 లక్షల పైచిలుకు లబ్ధిదారులకు రుణమాఫీ జరిగిందని సిఎం అన్నారు.

మా పనిమీద ఉన్న నమ్మకంతో ధైర్యంగా ముందుకు వెళుతున్నట్లు ఆయన చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం కచ్చితంగా కోటి మంది మహిళలకు లబ్ధి చేకూరుస్తామని మరోసారి ఆయన స్పష్టం చేశారు. ఒక్క కుటుంబంలో నలుగురు ఉన్న రుణమాఫీ లబ్ధిదారుల సంఖ్య కోటి అని వాళ్లే మమ్మల్ని కచ్చితంగా గెలిపిస్తారని ఆయన అన్నారు. వాళ్లు ఇప్పుడు మౌనంగా ఉన్నా తప్పకుండా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటేస్తారని సిఎం రేవంత్ ధీమా వ్యక్తం చేశారు. జనాభా లెక్కల గురించి జిల్లా జిల్లా కలెక్టర్‌లను కేంద్రం బడ్జెట్ అంచనాలు అడిగిందని, 2026 లో పూర్తి చేసి 2027 లో జనాభా లెక్కలు నోటిఫై చేస్తారన్న అంచనా ఉందని ఆయన తెలిపారు. దీనికి అనుగుణంగా కేంద్రం డిలిమిటేషన్‌కు సమాయత్తమవుతోందని ఆయన పేర్కొన్నారు. అందుకే దక్షిణాది రాష్ట్రాలు నష్టపోకుండా తమ ప్రయత్నాలు చేస్తున్నామని సిఎం రేవంత్ తెలిపారు. గతంలో ఎన్నికలకు ముందు తానేం చెప్పానో అదే జరిగిందని, భవిష్యత్‌లో కూడా తాను చెప్పబోయేదే జరుగుతుందని సిఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News