Thursday, March 13, 2025

ఆర్థికం.. అధ్వాన్నం

- Advertisement -
- Advertisement -

అబద్ధాల ప్రాతిపదికన రాష్ట్రాన్ని
నడపను. వాస్తవాలు అందరితో
పంచుకుని రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తా.
రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం, ఖర్చు మీ ముందు పెడతా. కెసిఆర్ మాకు వారసత్వంగా ఇచ్చింది అప్పులు, తప్పులు మాత్రమే. ప్రతినెలా
రూ.6,500 కోట్లు కెసిఆర్ చేసిన అప్పులు తప్పులకే సరిపోతుంది. ప్రభుత్వానికి ఉద్యోగులు సహకరిం చాలి. లేకపోతే పరిస్థితులు మరింత దిగజారుతాయి. మేము అధికారంలోకి వచ్చాక ప్రతినెలా ఒకటో తేదీన ఉద్యో గులకూ వేతనాలు ఇస్తున్నాం. అయితే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్టా ఒక నెల ఆశావర్కర్లకు కొంత ఆలస్యం జరిగింది.
సిఎం రేవంత్ రెడ్డి

ఊపర్ షేర్వానీ, అందర్ పరేషానీ లాగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి
బిఆర్‌ఎస్ హయాంలో అన్నీ అప్పులు.. తప్పులే నేను అబద్ధాల
ప్రాతిపదికన రాష్ట్రాన్ని నడపను వాస్తవాలు అందరితో పంచుకుని
రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తా ప్రైవేట్ స్కూల్స్‌తో ప్రభుత్వ పాఠశాలలు
ఎందుకు పోటీ పడట్లేదు ఎక్కడ లోపం ఉందో ఒక్కసారి ఆలోచన
చేయాలి తెలంగాణలో విద్యా ప్రమాణాలు పడిపోవడం ఆందోళనకరం
కొత్తగా నియామకమైన వారు తెలంగాణ భవిష్యత్తును తీర్చిదిద్దాలి
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జూనియర్ లెక్చరర్లుగా ఎంపికైన
అభ్యర్థులకు సిఎం చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేత

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రానికి కెసిఆ ర్ ఆర్థికంగా క్యాన్సర్ ఇచ్చారని.. క్యాన్సర్ ము దురుతుంటే రాష్ట్రం దివాళా తీసిందంటారా..? అని అంటున్నారని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. వాస్తవాన్ని ఎన్నాళ్ళు దాచిపెడతారని ప్రశ్నించారు. ఊపర్ షేర్వానీ, అందర్ పరేషానీ లాగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉందని, తా ను వాస్తవాలు చెబుతుంటే, దిగిపో దిగిపో అని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కెసిఆర్ కు టుంబం మొత్తం ఫ్యామిలీ ప్యాకేజ్‌లా అబద్ధా లు మాట్లాడుతున్నారని విమర్శించారు. తాను అబద్ధాల ప్రాతిపదికన రాష్ట్రాన్ని నడపను అని తేల్చిచెప్పారు. వాస్తవాలు అందరితో పంచుకు ని రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం, ఖర్చు మీ ముం దు పెడతానని, మీరే దేనికి ఎంత ఖర్చు పెట్టా లో చెప్పాలని ఉద్యోగాలు పొందిన అభ్యర్థులను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. కెసిఆర్ తమకు వారసత్వంగా ఇచ్చింది అప్పులు, తప్పులు మా త్రమే అని విమర్శించారు. ప్రతీ నెలా రూ. 6,500 కోట్లు కెసిఆర్ చేసిన అప్పులు తప్పులకే సరిపోతుందని తెలిపారు. ప్రభుత్వానికి ఉద్యోగులు సహకరించాలని.. లేకపోతే పరిస్థితులు మరింత దిగజారిపోతాయని అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ప్రతినెలా ఒకటో తారీఖున ఉద్యోగుల వేతనాలు ఇస్తున్నామని, ఏనా డూ ఆ లస్యం చేయడం లేదని తెలిపారు.

అయి తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్టా ఒక నెల ఆశావర్కర్లు, ఒక ఇతరులకు కొంత ఆలస్యం జరిగిందని చె ప్పారు. కుటుంబంలో ఒక నెల పాల బిల్లును వాయిదా వేస్తే మరో నెల ఇంటి కిరాయిని వా యిదా వేసినట్లుగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా సంక్షేమ పథకాలు, ఇతర అవసరాలను దృష్టిలో పెట్టుకుని సర్దుబాటు చేస్తున్నామని వివరించారు. రాష్ట్రంలో జూనియర్ లెక్చరర్, పాలిటెక్నిక్ లెక్చరర్ల ఉద్యోగాలకు ఎంపిక అయిన 1,532(1292 జూనియర్ లెక్చరర్స్, 240 పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టులు) అభ్యర్థులలో కొంతమంది గురువారం రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, సిఎస్ శాంతికుమారి, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రా ణా, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఇవిఎన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భం గా సిఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ, కొత్తగా ఉద్యోగ బాధ్యతలు చేపడుతున్న వారికి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. కొత్త అధ్యాపకులు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంవైపు నడిపించాని ఆకాంక్షించారు.

పదేళ్లలో ఏమీ చేయని వాళ్లు 10 నెలలకే తనను అధికారం నుంచి దిగిపో అంటున్నారని, పనిచేస్తుంటే కాళ్లు పట్టుకొని కిందకు లాగుతున్నారని సిఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి చేసి ఉంటే.. ఇప్పుడీ పరిస్థితే వచ్చి ఉండేది కాదని, తాను కూడా పోరాటం చేయాల్సి వచ్చేది కాదని అన్నారు. లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం కూలిపోయిందని చెప్పారు. కొంతమంది స్టేచర్ స్టేచర్ అని మాట్లాడుతున్నారని సిఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. ఇటీవల సర్పంచ్‌ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని కొంతమంది వచ్చారని, ఆ బిల్లులు ఎప్పటివీ అని అడిగితే మూడేళ్ల క్రితం నాటివి అని చెప్పారని అన్నారు. అప్పుడు ఆర్థిక మంత్రిగా హరీష్‌రావు ఆ బిల్లులు చెల్లిస్తానంటే ఎవరైనా అడ్డుకున్నారా..? అని ప్రశ్నించారు. ఇప్పుడు ఆయనే సర్పంచ్‌ల బిల్లులు వెంటనే చెల్లించాలని అంటున్నారని మండిపడ్డారు.

55 రోజుల్లోనే 11వేల టీచర్ పోస్టులు..
తెలంగాణ సాధనలో నిరుద్యోగులది కీలకపాత్ర అని చెప్పారు. కెసిఆర్ కుటుంబంలో ఉద్యోగాలు పోవడం వల్లే ఇప్పుడు నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తున్నాయని తెలిపారు. బిఆర్‌ఎస్ హయాంలో ఉద్యోగ నియామకాలు చేపట్టలేదని.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 50 వేల ఉద్యోగ నియామకాలు చేపట్టామని చెప్పారు.గతంలో సంతలో సరుకులా ప్రశ్నపత్రాలు అమ్మారని, తమ ప్రభుత్వం ఎలాంటి అవకతవకలు లేకుండా వేగంగా నియామకాలు చేపడుతుందని చెప్పారు.దేశ భవిష్యత్ తరగతి గదుల్లోనే ఉందని పెద్దలు చెప్పారని, అందుకే విద్యాశాఖ అధిక ప్రాధాన్యత ఇచ్చి అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని వెల్లడించారు. 55 రోజుల్లోనే 11 వేల టీచర్ పోస్టులు భర్తీ చేశామని గుర్తు చేశారు. తెలంగాణలో విద్యా ప్రమాణాలు పడిపోవడం ఆందోళనకరమని, కొత్తగా నియామకమైనవారు తెలంగాణ భవిష్యత్‌ను తీర్చిదిద్దాలని సూచించారు. ఉద్యోగాలపై కోర్టుల్లో చిక్కుముడులు విప్పుతూ సమస్యలు పరిష్కరిస్తున్నామని వివరించారు. ఇచ్చిన మాటల ప్రకారం 57,946 ఉద్యోగ నియామకాలు చేపట్టామని గర్వంగా చెబుతున్నామన్నారు. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో అయినా మొదటి సంవత్సరంలోనే 50 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు చేపట్టిన రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని పేర్కొన్నారు.

ప్రభుత్వం కంటే ప్రైవేటు పాఠశాలలు గొప్పవా..?
ప్రైవేట్ స్కూల్స్‌తో ప్రభుత్వ పాఠశాలలు ఎందుకు పోటీ పడట్లేదని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఈ సమస్యను పరిష్కరించాల్సింది ప్రభుత్వం, ఉపాధ్యాయులే అని పేర్కొన్నారు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలను తీర్చిదిద్దాలని పేర్కొన్నారు.30,000 ప్రభుత్వ పాఠశాలల్లో 25 లక్షల మంది విద్యార్థులు ఉంటే, 11,000 ప్రైవేటు పాఠశాలల్లో 36.7 లక్షల మంది విద్యార్థులు ఉన్నారని తెలిపారు. ప్రభుత్వం కంటే ప్రైవేటు పాఠశాలలు గొప్పవా..? అని ప్రశ్నించారు. ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులకు రూ.25 వేల వరకు ఖర్చు అవుతుంటే, ప్రభుత్వ బడుల్లో రూ.లక్ష వరకు ఖర్చు అవుతోందని అన్నారు. ప్రతీ ఏటా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతోందని, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎక్కడ లోపం ఉందో ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. గతంలో ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీ స్కూళ్లకు భవనాలు నిర్మించలేదని చెప్పారు. తెలంగాణలో విద్యా ప్రమాణాలు పెంచాలని తెలిపారు. ప్రభుత్వ స్కూళ్లలో విద్యాప్రమాణాలు పెంచేందుకే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌ను నిర్మించబోతున్నామన్నారు. ఇటీవలే 55 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కోసం రూ.11000 కోట్లు కేటాయించామని తెలిపారు. విద్యార్థి, నిరుద్యోగుల్లో నైపుణ్యాన్ని పెంచేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News