Monday, December 23, 2024

తెలంగాణకు మోడీ ఇచ్చింది..గాడిద గుడ్డు: సిఎం రేవంత్ ఫైర్

- Advertisement -
- Advertisement -

పదేళ్లలో తెలంగాణకు మోడీ ఇచ్చింది..గాడిద గుడ్డు అని సిఎం రేవంత్ రెడ్డి ఫైరయ్యారు. అధికారం కోసం బిజెపి..రాముడిని కూడా వదలటం లేదని విమర్శించారు. కళ్యాణం జరగకముందే అక్షింతలు పంచి…శ్రీరాముడిని అవమానించారని బిజెపిపై నిప్పులు చెరిగారు. కరీంనగర్ లో ఏర్పాటు చేసిన సభలో సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..పదేళ్లలో కరీంనగర్ గడ్డకు బండి సంజయ్ చేసింది ఏం లేదన్నారు.

పార్లమెంట్ సాక్షిగా మోడీ.. తెలంగాణ ఏర్పాటును అవమానించారు. మోడీ తెలంగాణ తల్లిని అవమానిస్తుంటే.. బండి సంజయ్ చూస్తూ ఉండిపోయాడని మండిపడ్డారు. రిజర్వేషన్లపై బిజెపి కుట్ర చేస్తోందన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను రద్దు చేసేందుకు మోడీ, అమిత్ షాలు కుట్రలు చేస్తున్నారని చెప్పారు. గత పదేళ్లలో పాలమూరు, కరీంనగర్ జిల్లాలు కెసిఆర్ చేతుల్లో బంది అయ్యాయని చెప్పారు. ఈ జిల్లాలకు కెసిఆర్ ఏం చేయలేదన్నారు. సెమీఫైనల్స్ లో కెసిఆర్ ను చిత్తుగా ఓడించారు.. ఇప్పుడు ఫైనల్లో మరోసారి చిత్తుగా ఓడించాలని సిఎం రేవంత్ పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News