Monday, December 23, 2024

సాగర్ ప్రాజెక్టుపైకి ఎపి పోలీసులు వస్తే.. నోరు మెదపలేదు: కెసిఆర్ పై సిఎం రేవంత్ ఫైర్

- Advertisement -
- Advertisement -

అసెంబ్లీలో ప్రాజెక్టులపై చర్చ పెడుదాం.. ఒక్క నిమిషం కూడా మీ మైక్ కట్ చేయం.. దమ్ముంటే రా.. కెసిఆర్ అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసిఆర్ ఒక రండ, రండ పనులు చేసి మాపై తప్పుడు ప్రచారాం చేస్తున్నారని మండిపడ్డారు. పోలింగ్ రోజు ఎపి పోలీసులు.. నాగార్జున సాగర్ ప్రాజెక్టుపైకి వచ్చి ఆధీనంలోకి తీసుకుంటే.. కెసిఆర్ నోరు మెదపలేదని సీఎం రేవంత్ కేసీఆర్ పై పైర్ అయ్యారు.

ఆదివారం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. నల్లగొండకు వెళ్లి నిరసన తెలపడం కాదు.. ముందు అసెంబ్లీలో చర్చ పెడదాం రా.. ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రాజెక్టు జలాలపై చర్చకు రండి.. అవసరం అయితే ఉమ్మడి సమావేశాలను పెడుతామని సిఎం అన్నారు.

రెండు రోజులు ప్రాజెక్టుల శ్వేతపత్రంపై చర్చిద్దామని.. రెండు రోజులు చాలవంటే సమావేశాలను పొడగిద్దాం… కేసీఆర్, కేటీఆర్, హరీష్, కవిత రావు అందరూ రావాలన్నారు. సమావేశాలు పూర్తైయ్యేవరకు కెసిఆర్ అసెంబ్లీలోనే కూర్చోవాలన్నారు. కాలు నొప్పి, పంటి నొప్పి అంటూ డ్రామాలు ఆడుతే.. మీ డ్రామాలను ప్రజలు గమనిస్తారన్నారు.  మీకు నిజాయితీ, చిత్తశుద్ధి ఉంటే సమావేశాలకు హాజరవ్వాలన్నారు. మీ నలుగురికి పూర్తి అవకాశం ఇస్తాం… తాను, ఉత్తమ్ ఇద్దరమే మాట్లాడుతామని అన్నారు. ఎవరు ద్రోహి, ఎవరు తెలంగాణకు అన్యాయం చేశారో తేలిపోతుంది.. నిజానిజాలేంటో నిరూపిద్దాం రా.. అంటూ సీఎం రేవంత్ సవాల్ విసిరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News