ఉదయం 11గంటలకు సిఎల్‌పి సమావేశం
పాల్గొననున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
కులగణన, వర్గీకరణ నిర్ణయాలను ప్రజల్లోకి
తీసుకెళ్లడంపై దిశానిర్దేశం స్థానిక ఎన్నికల
వ్యూహాలపై చర్చ అనంతరం ఢిల్లీకి సిఎం
రేవంత్‌రెడ్డి, పిసిసి సారథి మహేశ్‌కుమార్
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గేతో భేటీ
కులగణన, వర్గీకరణపై నివేదిక
మన తెలంగాణ/హైదరాబాద్: నగరంలోని ఎంసిఆర్‌హెచ్‌ఆర్‌డి లో గురువారం ఉదయం 11 గంటలకు సీఎల్పీ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలకు పలు అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు. బిసి కులగణన, ఎస్‌సి వర్గీకరణ నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై కూడా చర్చ జరుగుతుందని పార్టీ వర్గాల సమాచారం. దీంతో పాటు త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలపై ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేస్తారు. సిఎల్‌పి సమావేశం అనంతరం గురువారం సాయంత్రం సిఎం రేవంత్‌రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్‌లు ఢిల్లీ వెళ్లనున్నారు. కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గెని కలిసి బిసి కులగణన, ఎస్‌సి వర్గీకరణపై వివరించనున్నారు.