Friday, December 20, 2024

త్వరలో గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల చేస్తాం: సిఎం రేవంత్

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ గెలుపులో నిరుద్యోగుల కృషి మరువలేనిదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నూతనంగా ఎంపికైన 2వేల మంది గురుకుల టీచర్స్, లైబ్రేరియన్ల అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలను సిఎం రేవంత్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుద్యోగులు ఉద్యోగాల కోసం కోట్లాడారని.. ఎంతో మంది విద్యార్థులు అమరులయ్యారని చెప్పారు.

గత ప్రభుత్వం ఉద్యోగ నియామకాలను చేపట్టకుండా విద్యార్థుల జీవితాలతో ఆడుకుందని సిఎం విమర్శించారు. మా ప్రభుత్వం వచ్చిన వెంటనే టీఎస్సీఎససీని ప్రక్షాళన చేసి.. కొత్త బోర్డును నిమమించామని తెలిపారు. ఉద్యోగాల భర్తీపై మా ప్రభుత్వం దృష్టి పెట్టిందని.. త్వరలోనే గ్రూప్ 1 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ వచ్చిన 70 రోజుల్లోనే 25వేల ఉద్యోగాలను భర్తీ చేసిందన్నారు. ఒక రైతు బిడ్డ ముఖ్యమంత్రి అయితే..కెసిఆర్ తట్టుకోలేకపోతున్నాడని రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News