Sunday, December 22, 2024

వచ్చే నెల నుంచి రుణమాఫీ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో: వచ్చే నెల నుం చి రుణమాఫీ అమలవుతుందని, దాదాపు రూ.31 వేల కోట్ల రైతుల రుణమాఫీ చేయబోతున్నామని రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తె లిపారు. ఖమ్మం జిల్లా, పాలేరు నియోజకవర్గం, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం మండలాల్లో శనివారం ఆయన విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మా ట్లాడుతూ.. ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రుణమాఫీ కోసం అన్ని సమకూరుస్తున్నామని అన్నా రు. పేదలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో త మ ప్రభుత్వం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని అన్నారు. ఎన్నికల సమయంలో ఏన్ని హామీలను ఇచ్చామో వాటన్నింటినీ విడతల వారీగా నెరవేర్చేందుకు ప్ర భుత్వం చిత్తశుద్ధితో ఉందని అన్నారు. త్వరలో అ ర్హులందరికీ రేషన్ కార్డులు మంజూరు చేయనున్న ట్లు, ఆసరా పెన్షన్లు అందజేయనున్నట్లు తెలిపా రు. ఇందిరమ్మ ఇళ్లు పేదవాళ్లలో అతిపేదవాళ్లకు ముందు మంజూరు చేస్తామన్నారు.

రాబోయే మూడు సంవత్సరాల్లో పాలేరు నియోజకవర్గంలో అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు అందజేస్తామన్నారు. రాబోయే సంవత్సరం లోపు నియోజకవర్గంలోని ప్రతి ఇంటి ముందు సిసి రోడ్లు, డ్రై నేజీలో నిర్మాణం చేస్తామన్నారు. ప్రభుత్వ భూములకు పేదలు హక్కుదార్లని, ప్రభుత్వ భూములు పే దలకుపంచుతామని అన్నారు. గ్రామాల్లో కావాల్సిన పంచాయతీ భవనాలు, కమ్యూనిటీ హాళ్లు, మౌలిక సదుపాయాలు కల్పిస్తామని, తాగునీటి స రఫరాకు చర్యలు తీసుకుంటామని అన్నారు. లిఫ్ట్ లు రిపేరు చేయించి రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. రాజేశ్వరపురంలో నేలకొండపల్లి మండల కళ్యాణల క్ష్మి 21 మంది లబ్ధ్దిదారులకు, బచ్చొడు గ్రామం లో తిరుమలాయపాలెం మండలానికి చెందిన 40 మంది కళ్యాణలక్ష్మి లబ్ధిదారులకు మంత్రి చెక్కులను పంపిణీ చేశారు. పలు గ్రామాలను నందర్శించి ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులను ఆ దేశించారు.

తిరుమలాయపాలెం మండలం లక్ష్మీదేవిపల్లి తండా నుంచి కారులో వెళ్తున్న మంత్రి నేరుగా కూలీల దగ్గరికి వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మంత్రి కాన్వాయ్ కనపడగానే ఉత్సాహంతో కలవడానికి పరుగెత్తుకుంటూ వస్తున్న కూలీలను చూసి కారు ఆపి వారి వద్దకు వెళ్లి వారితో ముచ్చటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆ తరువాత కూసుమంచి మండలంలోని వాల్యాతండా గ్రామంలో బాదావత్ బాల్య మృతదేహాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన వెంట గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఖమ్మం ఆర్‌డిఒ జి. గణేష్, నియోజకవర్గ ప్రత్యేక అధికారి, జిల్లా ఉపాధి కల్పన అధికారి శ్రీరామ్, పంచాయతీరాజ్ ఇఇ వెంకట్ రెడ్డి, మిషన్ భగీరథ ఇఇలు పుష్పలత, వాణిశ్రీ, ఇర్రిగేషన్ ఇఇ వెంకటేశ్వర రావు, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు విజయ చంద్ర, తహశీల్దార్లు, ఎంపిడిఓలు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News