హైదరాబాద్ విస్తరణకు అనుగుణంగా ప్రజలకు విస్తృత సేవలను అందించేలా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ (హైడ్రా) రూపుదిద్దుకోవాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అన్నారు. జాతీయ విపత్తుల నిర్వహణ చట్టానికి అనుగుణంగా ఈ కొత్త వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆయన అధికారులకు సూ చించారు. హైడ్రా వ్యవస్థాగత నిర్మాణం, విధి, వి ధానాలపై మరింత అధ్యయనం చేసి కసరత్తు చే యాలని ముఖ్యమంత్రి సూచించారు. జీహెచ్‌ఎంసితో పాటు, హెచ్‌ఎండిఏ, వాటర్‌బోర్డు, విజిలె న్స్, ట్రాఫిక్, విద్యుత్, పోలీస్ విభాగాలను సమన్వయం చేసుకొని మరింత సమర్థంగా హైడ్రా ప నిచేసేలా ఉండాలని అధికారులకు ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. హైడ్రా ఏర్పాటు, దాని విధి,విధానాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం సచివాలయంలో సమీక్ష చేశారు. ఈ స మావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్య కార్యదర్శి దానకిషోర్, జిహెచ్‌ఎంసి కమిషనర్ అమ్రాపాలి, జిహెచ్‌ఎంసి ఇవిడిఎం కమిషనర్ రంగనా థ్, సిఎంఒ ముఖ్య తరువాయి 12లోకార్యదర్శి శేషాద్రి, సి ఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డిలు పాల్గొన్నారు.
ఎన్‌ఫోర్స్‌మెంట్ విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ విభాగాన్ని…..
ఈ సందర్భంగా సిఎం రేవంత్ మాట్లాడుతూ ఇప్పుడున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ విభాగాన్ని అందుకు అనుగుణంగా పునర్ వ్యవస్థీకరించాలని సిఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. కొత్త విభాగంలో ఏయే స్థాయి అధికారులుండాలి, ఎంత మంది సిబ్బంది ఉండాలి, ఏయే విబాగాలపై వీరిని డిప్యూటేషన్‌పై తీసుకోవాలన్న అంశాలపై స్పష్టమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సిఎం ఆదేశించారు. జీహెచ్‌ఎంసితో పాటు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు వరకు 2 వేల కిలోమీటర్ల పరిధిలో హైడ్రా పని చేయాల్సి ఉంటుందని, పని విభజనకు వీలుగా సిటీలో ఇప్పుడున్న జోన్ల తరహాలో భౌగోళిక పరిధిని నిర్ధేశించాలని సిఎం సూచించారు. అవసరమైతే హైడ్రాకు ప్రత్యేక నిధులు కేటాయించే అంశాన్ని పరిశీలించాలని సిఎం రేవంత్ చెప్పారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోగా ముసాయిదా తయారు చేయాలని ఆయన అధికారులకు సూచించారు.
విపత్తుల నిర్వహణతో పాటుగా ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, చెరువులు, నాలాల కబ్జాలకు అడ్డుకట్ట వేయటం, ఆక్రమణలను తొలగించటం, అక్రమ నిర్మాణాలు, నిబంధనలను పాటించని ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు ప్రకటనల తొలగింపు, ట్రాఫిక్ నిర్వహణ, తాగునీరు, విద్యుత్ సరఫరాలో హైడ్రా కీలకంగా వ్యవహారించేలా విధులు అప్పగించాలని సిఎం అధికారులను ఆదేశించారు. హెచ్‌ఎండిఏ, వాటర్‌వర్క్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్, మున్సిపల్ విభాగాల మధ్య ఎప్పటికప్పుడు సమన్వయం ఉండాలని అధికారులను సిఎం రేవంత్ అప్రమత్తం చేశారు. జీహెచ్‌ఎంసి పరిధిలో ఉన్న అనధికారిక హోర్డింగ్స్, ఫ్లెక్సీలు తొలగింపు, అపరాధ రుసుము, వసూళ్ల బాధ్యతను హైడ్రాకు బదలాయించాలని సిఎం రేవంత్ ఆదేశించారు. నాలాలు, చెరువులు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణల విషయంలో నిబంధనలు కఠినంగా ఉండేలా అధ్యయనం చేయాలని ఆయన సూచించారు.