Sunday, December 22, 2024

మనువడితో సిఎం హోలీ వేడుకలు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: హోలీ వేడుకలను క్రీడాకారులు, రాజకీయ నాయకులు, సినీ పరిశ్రమకు చెందిన వారు ఘనంగా జరుపుకున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి సైతం హోలీ వేడుకలను తన మనువడితో కలిసి చేసుకున్నారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో సోమవారం కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా ఈ వేడుకలను సిఎం జరుపుకున్నారు. మనువడు రియాన్స్‌తో కలిసి సిఎం రేవంత్‌రెడ్డి సంతోషంగా ఈ సంబురాలు జరుపుకున్నారు. మనువడికి రంగు పూస్తూ ఎంతో ఆనందంగా సెలబ్రేషన్స్ చేసుకున్నారు. మనువడితో కలిసి రేవంత్ రెడ్డి సరదాగా హోలీ వేడుకల్లో పాల్గొన్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News