Friday, December 20, 2024

నేను పిల్లులను, కుక్కలను చంపను.. సింహాన్నే చంపుతా…

- Advertisement -
- Advertisement -

‘ఆప్ కీ అదాలత్’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

హైదరాబాద్: తాను పిల్లులను, కుక్కలను చంపనని, చంపితే సింహాన్నే చంపుతానని సిఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇండియా టివిలో నిర్వహించే ఫేమస్ టాక్ షో ‘ఆప్ కీ అదాలత్’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. గురువారం ఢిల్లీకి వెళ్లిన ఆయన ఈ కార్యక్రమంలో పలు విషయాలను పంచుకున్నారు. దీనికి సంబంధించిన ప్రోమోను సిఎం రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.

కెసిఆర్ సర్కారు మిమ్మల్ని జైలులో వేసినందుకు రివేంజ్ తీసుకుంటున్నారా అని ‘ఆప్ కీ అదాలత్’ కార్యక్రమంలో యాంకర్ రజత్ శర్మ అడిగిన ప్రశ్నకు సిఎం రేవంత్ బదులిస్తూ రివేంజ్ ఇంకా స్టార్టే కాలేదని సిఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బిఆర్‌ఎస్ నేతలు తరచూ అంటున్నారు సింహం లోపల ఉంది, బయటకు వస్తుంది అప్పుడు చూడండి అంటున్నారుగా అని రేవంత్ రెడ్డిని ప్రశ్నించగా, రమ్మనండి పిస్టోల్‌తో రెడీగా ఉన్నాం, ఒక్క తూటాతో అయిపోతుందని సిఎం రేవంత్ ఘాటుగా రిప్లై ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News