Tuesday, November 5, 2024

ఎంసిఆర్‌హెచ్‌ఆర్‌డిలో సిఎం రేవంత్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

అక్కడి పనులపై సిఎం ఆరా

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ(ఎంసిఆర్‌హెచ్‌ఆర్‌డి)ని ఆదివారం సందర్శించారు. ఆ సంస్థ డిజి డాక్టర్ శశాంక్ గోయల్ సిఎం రేవంత్ రెడ్డికి పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. రాష్ట్ర పంచాయతీరాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కతో కలిసి ఎంసిఆర్‌హెచ్‌ఆర్‌డికి వెళ్లిన సిఎం రేవంత్ రెడ్డి అక్కడ జరుగుతున్న కార్యకలాపాలు, తాజా పరిస్థితులను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సంస్థ కార్యకలాపాలు గురించి వాకబు చేశారు. సిఎం రేవంత్‌రెడ్డి ఎంసిఆర్‌హెచ్‌ఆర్‌డికి వెళ్లిన సందర్భంగా అక్కడి ఫ్యాకల్టీ సభ్యులతో ఆయన సమావేశమయ్యారు. సంస్థ కార్యకలాపాలను డిజి శశాంక్ గోయల్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ఉద్యోగులకు ఇస్తున్న శిక్షణ గురించి తెలిపారు. అనంతరం సంస్థలోని వివిధ బ్లాకులను సోలార్ పవర్ వాహనంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటించి పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలను సిఎం రేవంత్ రెడ్డి అధికారులకు వివరించారు. ఇందుకు తగ్గట్లుగా యంత్రాంగం కూడా పని చేయాలని స్పష్టం చేశారు. మాజీ మంత్రి షబ్బీర్ అలీ, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్, వివిధ విభాగాల ఫ్యాకల్టీల సభ్యులు పాల్గొన్నారు.

CM Revanth Reddy in MCRHRD

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News