Monday, December 23, 2024

100 కొత్త ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన సిఎం రేవంత్

- Advertisement -
- Advertisement -

ప్రజా ప్రభుత్వం ఏర్పాడిన 48 గంటల్లోనే మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మా ప్రభుత్వం ఇచ్చిన తొలి హామీని క్షేత్రస్థాయిలో తొలిసారి అమలు చేసింది ఆర్టీసీ కార్మికులేనన్నారు. శనివారం 100 కొత్త బస్సులను సిఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారించలేదని విమర్శించారు. ఆర్టీసీ కార్మికులు సమ్మెలు చేసినా.. కెసిఆర్ చర్చలు కూడా జరపలేదు. తెలంగాణ సాధన కోసం ఆర్టీసీ కార్మికులు పోరాటం చేశారు. మహాలక్ష్మీ పథకం కింద రూ.500 కోట్లు ఇచ్చామని సిఎం రేవంత్ రెడ్డి చెప్పారు.

గత ప్రభుత్వం.. రూ.2.97 లక్ష కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టిందన్నారు. ఈసారి కూడా రూ.3లక్షల కోట్లకు పైగా అంకెలతో బడ్జెట్ ను అధికారులు తయారు చేశారని చెప్పారు. నిజంగా బడ్జెట్ లో కేటాయించిన మొత్తం నిధులు ఖర్చు చేస్తున్నారా అని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క అధికారులను ప్రశ్నించారని.. గత పదేళ్లుగా అవాస్తవ లెక్కలతో బడ్జెట్ రూపొందించామని అధికారులు తెలిపినట్లు సిఎం చెప్పారు. ఇవాళ వాస్తవాలకు అనుగుణంగా బడ్జెట్ ను ప్రవేశపెట్టామని సిఎం రేవంత్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News