- Advertisement -
హైదరాబాద్: శిల్పకళా వేదికగా సిఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘భూభారతి’ పోర్టల్ ప్రారంభమైంది. తొలుత ఈ కార్యక్రమాన్ని మూడు మండలాల్లో అమలు చేయనున్నారు. జూన్ 2వ తేదీ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పోర్టల్ అందుబాటులోకి రానుంది. ప్రజల నుంచి అవసరమైన సూచనలు స్వీకరించి, తగిన మార్పులు చేయాలని ఇప్పటికే రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. ప్రజల నుంచి వచ్చే స్పందన మేరకు ఈ పోర్టల్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.
- Advertisement -